Viral News: ఇలాంటి వారి పక్కింట్లో నివసించడం చాలా కష్టం.. టూర్‌కు వెళుతూ వాళ్లు ఏం చేశారంటే..
ABN , Publish Date - Feb 22 , 2025 | 05:53 PM
ఇరుగు పొరుగు వారితో సఖ్యంగా ఉంటేనే సంతోషకర జీవనం సాధ్యమవుతుంది. అయితే ఓ కుటుంబం వెరైటీగా ఆలోచించి ఇరుగు పొరుగు వారిని తీవ్ర ఇబ్బందుల పాలు చేసింది. రాత్రిళ్లు నిద్ర లేకుండా, పగల మనశాంతి లేకుండా చేసింది.

ఇరుగు పొరుగు వారికి ఇబ్బందులు సృష్టించకుండా ప్రశాంతంగా జీవించడం ప్రతి ఒక్కరూ అలవరచుకోవాల్సిన లక్షణం. ఇరుగు పొరుగు వారితో (Neighbours) సఖ్యంగా ఉంటేనే సంతోషకర జీవనం సాధ్యమవుతుంది. అయితే ఓ కుటుంబం వెరైటీగా ఆలోచించి ఇరుగు పొరుగు వారిని తీవ్ర ఇబ్బందుల పాలు చేసింది. రాత్రిళ్లు నిద్ర లేకుండా, పగల మనశాంతి లేకుండా చేసింది. ఆ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది (Viral News).
ఓ వ్యక్తి తనకెదురైన అనుభవం గురించి రెడ్డిట్ ద్వారా మిగిలిన వారితో పంచుకున్నాడు. అతడు చెప్పిన సమాచారం ప్రకారం.. తన ఇంటి మేడ మీద ఉన్న వ్యక్తులు ఇటీవల వీకెండ్ ట్రిప్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ ఉండడం లేదు. అయినప్పటికీ తమ ఇంట్లోని రేడియో (Radio)ను ఫుల్ సౌండ్‌లో మెయిన్ డోర్ పక్కనే పెట్టి వెళ్లిపోయారు. ఇంట్లో ఎవరో ఉన్నారు అని తెలిసేలా చేయడం కోసమే వారు ఈ ప్లాన్ వేశారు. అయితే ఈ ప్లాన్ వలన చుట్టు పక్కల వారికి మనశాంతి లేకుండా పోయింది. రాత్రివేళ శబ్దాల కారణంగా నిద్రలేకుండా పోయింది.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వందల మంది నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ ఇంటికి కరెంట్ సప్లై వెళ్లకుండా ఆఫ్ చేయండి``, ``ఇది నిజంగా దారుణం. వారి మీద కేసు పెట్టాలి``, ``తమ సౌఖ్యం తప్ప ఇతరుల గురించి ఆలోచించకపోవడం చాలా హేయం``, ``వారి గురించి టౌన్ అధికారులకు ఫిర్యాదు చేయండి`` అంటూ నెటిజన్లు తమకు తోచిన సలహాలు ఇచ్చారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..