Share News

Viral News: మహాకుంభమేళాకు అమ్మాయిలు.. వారు చేసిన పనికి భక్తులు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా..

ABN , Publish Date - Feb 07 , 2025 | 03:57 PM

ప్రయాగ్ రాజ్‌కు వెళ్తున్న భక్తులతో విమానాలు, రైళ్లు, బస్సులు కిక్కిరిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లోనూ ఇసుక వేస్తే రాలనంత జనం ప్రయాణిస్తున్నారు. ఇక కార్లు, ఆటోల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Viral News: మహాకుంభమేళాకు అమ్మాయిలు.. వారు చేసిన పనికి భక్తులు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా..
Maha Kumbh Mela Train Journey

ఉత్తర్ ప్రదేశ్: ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 144 ఏళ్లకు ఓసారి వచ్చే మహాకుంభమేళ కావడంతో తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ ఏడాది జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాకు ఇప్పటివరకూ 39 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు అధికారవర్గాలు తెలిపాయి. వీరంతా పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసినట్లు వెల్లడించారు. వీరందరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. కాగా, ఫిబ్రవరి 26వరకూ కొనసాగే వేడుకలకు మరికొన్ని కోట్లమంది భక్తులు తరలిరానున్నట్లు అధికారులు చెబుతున్నారు. తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులతో ప్రయాగ్ రాజ్ ప్రాంతం భక్తిపారవశ్యంలో మునిగిపోతోంది.


ప్రయాగ్ రాజ్‌కు వెళ్తున్న భక్తులతో విమానాలు, రైళ్లు, బస్సులు కిక్కిరిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లోనూ ఇసుక వేస్తే రాలనంత జనం ప్రయాణిస్తున్నారు. ఇక కార్లు, ఆటోల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రయాగ్ రాజ్‌కు వెళ్తున్న భక్తుల కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను సైతం నడుపుతోంది. అయితే ప్రయాణికులకు ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. ఏసీ కోచ్‌లన్నీ జనరల్ కోచ్‌లు మాదిరిగా దర్శనం ఇస్తున్నాయి. కాలు జరిపే పరిస్థితి కూడా రైళ్ల లోపల కనిపించడం లేదు.


అయితే ఇలా ప్రయాగ్ రాజ్‌కు వెళ్తూ కొంతమంది యువతులు చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మహాకుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించేందుకు సిద్ధమైన అమ్మాయిలు టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ప్రయాగ్ రాజ్ వెళ్లే రైలు ఎక్కారు. ప్రయాణికుల తాకిడి విపరీతంగా ఉండడం, నిలబడేందుకు సైతం ఖాళీ లేకపోవడంతో వారికి ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో వారంతా ఏకంగా వాష్ రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. గంటల తరబడి అందులోనే ఉంటూ ప్రయాణించారు. అయితే తోటి ప్రయాణికులు బాత్రూమ్‌కు వెళ్లాల్సి వచ్చినా వారు మాత్రం తలుపు తీయలేదు. వారు చేసిన పనికి పలువురు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే యువతులు బాత్రూమ్‌లో ఉంటూ ఫొటోలు దిగడం, రీల్స్ చేయడం వంటివి చేసి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఇవి కాస్త ఇప్పుడు వైరల్‌గా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Viral Video: పెళ్లిలో గన్లు పట్టుకుని ఫోజులు ఇచ్చిన వధూవరులు.. మధ్యలో వధువుకు ఊహించని షాక్.. చివరకు..

Viral Video: స్కూటీపై వెళ్తూ అదుపు తప్పి లారీ కిందపడ్డాడు.. చివరకు జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..

Updated Date - Feb 07 , 2025 | 03:58 PM