Share News

Viral News: ప్రియుడితో పెళ్లి చేయాలని కోరిన యువతి.. తండ్రి చేసిన పని తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

ABN , Publish Date - Jan 15 , 2025 | 04:31 PM

గ్వాలియర్‌కు చెందిన మహేశ్ గుర్జార్, తనూ(20) తండ్రికుమార్తెలు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాకు చెందిన విక్కీ, తనూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా యువతి తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు.

Viral News: ప్రియుడితో పెళ్లి చేయాలని కోరిన యువతి.. తండ్రి చేసిన పని తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
Tanu Gurjjar

భోపాల్: మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను పోలీసుల ఎదుటే తుపాకీతో కాల్చి హత్య చేయడం పెను సంచలనం సృష్టిస్తోంది. కుమార్తె ప్రేమను ఒప్పుకోని ఆ పెద్ద మనిషి ఏకంగా ఆమె ప్రాణాలనే బలితీసుకున్నాడు. తల్లిదండ్రులు, బంధువులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ ఆ యువతి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడమే పాపమైపోయింది. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి చేయమని అడగడం ఆమె చేసిన నేరమైంది. పోలీసులు చర్చలు జరుపుతుండగానే కన్న తండ్రే ఆమెను కాల్చి చంపడం పెను దుమారాన్ని రేపుతోంది. కాగా, ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.


గ్వాలియర్‌కు చెందిన మహేశ్ గుర్జార్, తనూ గుర్జార్(20) తండ్రికుమార్తెలు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాకు చెందిన విక్కీ, తనూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా యువతి తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాలతో వారిద్దరి పెళ్లి చేసేందుకు మహేశ్ గుర్జార్ ససేమిరా అన్నారు. అనంతరం మరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించాడు. మరో ఆరు రోజుల్లో పెళ్లి ఉందనగా.. సొంత కుమార్తెను అతను కాల్చి చంపాడు.


ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో తనూ తీవ్ర ఆవేదనకు గురైంది. దీంతో “విక్కీని నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. నా కుటుంబం మొదట పెళ్లికి అంగీకరించినా.. తర్వాత మనసు మార్చుకుంది. నాకు ఇష్టం లేని వ్యక్తితో వివాహం చేయాలని చూస్తున్నారు. పెళ్లి చేసుకోనని చెప్తే రోజూ నన్ను కొట్టి చంపుతామని బెదిరిస్తున్నారు. నాకు ఏదైనా జరిగితే నా కుటుంబం, బంధువులే బాధ్యత వహించాల్సి ఉంటుందని" 52 సెకన్ల నిడివి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే ఇది కాస్త వైరల్‌గా మారింది.


ఈ వీడియో వ్యవహారం యువతి తండ్రి మహేశ్ గుర్జార్‍కు తెలియడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇంటి వద్ద ఆమెను బహిరంగంగా అందరి ముందే చెప్పుతో కొట్టాడు. మరోవైపు వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. సూపరింటెండెంట్ ధర్మవీర్ సింగ్ నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందం తనూ ఇంటికి మంగళవారం చేరుకుంది. కులపెద్దలు సైతం సమస్య పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు. పోలీసులు, కులపెద్దలు అంతా కలిసి పంచాయితీ పెట్టి ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.


అయితే విక్కీనే పెళ్లి చేసుకుంటానని తనూ, తాను కుదిర్చిన వివాహమే చేసుకోవాలని గుర్జార్ భీష్మించుకుని కూర్చుకున్నారు. అందరి ముందు తాను చెప్పిన వ్యక్తిని కాకుండా ప్రియుడినే చేసుకుంటానని యువతి పదేపదే చెప్పడంతో గుర్జార్ ఆగ్రహానికి గురయ్యాడు. చర్చలు జరుగుతుండగానే తన వెంట తెచ్చుకున్న దేశీయ తుపాకీతో కుమార్తె ఛాతీపై కాల్చాడు. అనంతరం వెంటవెంటనే తనూ నుదురు, మెడ, కళ్లు, ముక్కుపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. దీంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో పోలీసులు, కుల పెద్దలు నిర్ఘాంతపోయారు. వెంటనే మహేశ్‌ను అడ్డుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా, ఈ ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Viral News : సంక్రాంతికి ఊరెళ్తున్నాం.. ఇంట్లో ఏం లేవు.. దొంగలకు డోర్‌పై నోట్..

Viral Video: ఈ మహాతల్లికి దండం రా స్వామి.. రీల్స్ మత్తులో పిల్లాడిని ఎలా విసిరేసిందో చూడండి..

Updated Date - Jan 15 , 2025 | 04:34 PM