Viral: తొలిసారిగా భారతీయ రైలు ఎక్కిన డచ్ మహిళ! పక్క సీటులోని ప్రయాణికుడు చేసిన పనికి..
ABN , Publish Date - Jan 21 , 2025 | 06:19 PM
భారతీయ రైల్లో వెళుతుండగా పక్క సీటులో కూర్చున్న వ్యక్తి తన ఫొటోలను సీక్రెట్‌గా తీశాడంటూ ఓ డచ్ మహిళ షేర్ చేసిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. అసభ్యంగా ప్రవర్తించిన భారతీయ యువకుడిపై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: భారత పర్యటనలో ఉన్న ఓ డచ్ మహిళకు తాజాగా షాకింగ్ అనుభవం ఎదురైంది. పక్క సీటులో ఉన్న ప్రయాణికుడు హద్దు మీరి చేసిన పని ఆమెకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అసలు ఏం జరిగిందీ చెబుతూ ఆమె నెట్టింట పంచుకున్న ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Viral).
ఢిల్లీ నుంచి ఆగ్రాకు రైల్లో వెళుతుండగా ఈ ఘటన జరిగిందని సదరు మహిళ చెప్పుకొచ్చింది. ‘‘అప్పటికే నేను బాగా అలిసిపోయి ఉన్నా. రైల్లో కూర్చున్నాక కాస్త రెస్టు దొరుకుతుందని భావించా. కానీ నా పక్కనున్న వ్యక్తి ఊరికే నాతో మాట్లాడటం మొదలెట్టాడు. సీక్రెట్‌గా నా ఫొటోలు తీసే ప్రయత్నం చేశాడు. నేను మొదట అతడిని పట్టించుకోలేదు. కిటికీలోంచి బయటకు చూడటం ప్రారంభించా. కానీ అతడు మాత్రం నన్నే తదేకంగా చూస్తూ విసిగించడం ప్రారంభించాడు. నేను ఫోన్లో ఏం చేస్తున్నానో చూడసాగాడు’’ అని చెప్పుకొచ్చింది.
Viral: స్కూల్ రోజుల్లో నాటకంలో భార్యాభర్తలుగా నటించి.. 20 ఏళ్ల తరువాత ఊహించని విధంగా..
‘‘అతడి తీరు నాకు ఇబ్బందిగా అనిపించింది. నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పా. కానీ అతడు నా మాటను లక్ష్య పెట్టలేదు. దీంతో, నేను అతడిని వీడియోలో రికార్డు చేయడం ప్రారంభించా. ఇలా చేస్తే అతడు తన తప్పు తెలుసుకుంటాడనుకున్నా. కానీ అతడు మాత్రం నేను చెప్పేదేమీ పట్టించుకోలేదు’’ అని చెప్పుకొచ్చింది.
తాను రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి చాలా ఇబ్బంది పెట్టాడని, అమర్యాదకరంగా ప్రవర్తించాడని వీడియోలో ఆమె చెప్పుకొచ్చింది. అతడికి బుద్ధి రావాలనే ఈ వీడియో రికార్డు చేస్తు్న్నట్టు చెప్పింది. అతడిపై ఫిర్యాదు చేసేందుకు రైల్లో కూడా ఎవరూ అందుబాటులో లేరని, చివరకు ఓ వ్యక్తికి నా సమస్య చెప్పుకొచ్చానని అన్నది. భారత్ గురించి చెడు ప్రచారం చేయాలన్నది తన ఉద్దేశం కాదని, అయితే, పక్కసీటు వ్యక్తి తీరు మాత్రం అస్సలు సరిగా లేదని స్పష్టం చేసింది.
Viral: గంటకు 282 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలుకు వేళాడుతూ ప్రయాణం! తృటిలో తప్పిన ప్రమాదం!
ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళ ఈ వీడియో షేర్ చేయగా జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. అతడు చేసింది ముమ్మాటికీ తప్పేనని అన్నాడు. కొందరికి సభ్యత తెలీదని కూడా మండిపడ్డారు.
మహిళ మాత్రం ఇండియా అద్భుతమైన దేశమని కితాబునిచ్చింది. భారత్‌లో పర్యటించాలని ఎప్పటి నుంచీ తాను అనుకుంటుండగా ఇన్నాళ్లకు ఆ కోరిక తీరిందంటూ హర్షం వ్యక్తం చేసింది.
Viral: వామ్మో.. ఈ కోతి గాలిపటం ఎగరేయడం ఎక్కడ నేర్చుకుందో.. షాకింగ్ వీడియో