Share News

Kumbhmela Monalisa Harassed: కుంభమేళా మోనాలిసాకు వేధింపులు! ఆగంతుకులు ఆమె టెంట్‌లోకొచ్చి..

ABN , Publish Date - Jan 23 , 2025 | 06:30 PM

మహాకుంభ‌మేళా మోనాలిసాకు కొత్త చిక్కులు వచ్చాయి. తన ఫొటో కావాలంటూ కొందరు టెంట్‌లోకి చొరబడి ఇబ్బంది పెట్టారని ఆమె తాజాగా ఆరోపించింది.

Kumbhmela Monalisa Harassed: కుంభమేళా మోనాలిసాకు వేధింపులు! ఆగంతుకులు ఆమె టెంట్‌లోకొచ్చి..

ఇంటర్నెట్ డెస్క్: కుంభమేళా మోనసాలిసాగా నెట్టింట పాప్యులర్ అయినా ఇండోర్ యువతి అనుకోని చిక్కుల్లో పడింది. నెట్టింట అనుకోకుండా వచ్చిన ఫాలోయింగ్ ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టింది. కొందరు ఆగంతుకులు తన టెంట్‌లోకి వచ్చి తమతో ఫొటోలు దిగాలంటూ వేధించారని ఆమె వాపోయింది (Kumbhmela Monalisa Harassed).

‘‘కొందరు పురుషులు నా టెంట్‌లోకి వచ్చారు. తమతో ఫొటోలు దిగాలని వేధించారు. మా నాన్న పంపించారని అన్నారు. కానీ నేను కుదరదని చెప్పాను. మా నాన్న దగ్గరకే వెళ్లమని గట్టిగా చెప్పాను. కానీ వాళ్లతో ఫొటోలు దిగలేదు. నాకు చాలా భయమేసింది’’ అని ఆమె చెప్పుకొచ్చింది (Viral).

Air Hostess to pig farmer: ఎయిర్ హోస్టస్ జాబ్‌కు గుడ్ బై చెప్పి పందుల పెంపకం! 2 నెలలు తిరిగే సరికల్లా..


ఆ తరువాత తన తండ్రి వచ్చి తాను ఎవరినీ టెంట్ వద్దకు పంపించలేదని చెప్పినట్టు తెలిపింది. ‘‘ఆ తరువాత నా తండ్రి వాళ్లను నిలదీశాడు. అలా అనుమతి లేకుండా టెంట్‌లోకి ఎలా వెళతారని మండిపడ్డాడు. మరోవైపు, నా సోదరుడు కూడా తీవ్ర ఆగ్రహానికి గురై వాళ్ల సెల్‌ఫోన్లు తీసుకుని నా ఫొటోలు డిలీట్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు వాళ్ల నా సోదరుడిపై దాడి చేశారు’’ అని వాపోయింది. తన ఉదంతం వైరల్ అయ్యాక అనేక మంది ఫొటోలు అంటూ వెంటపడుతున్నారని చెప్పింది.

‘‘ఆమెకు ప్రయాగ్‌రాజ్‌లో ఉండటం ఇబ్బందిగా మారింది. తన పని తాను చేసుకోలేకపోతోంది. అందరూ ఆమెనే ఫాలో అవుతున్నారు. కెమెరాలతో ఆమెను సమీపిస్తూ మాట కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. తను పూలు కూడా అమ్ముకోలేకపోతోంది’’ అని యువతి తాత మీడియాకు తెలిపారు.

Viral: మిలిటరీ కత్తి చేతబూని స్టెప్పులేసిన అమెరికా అధ్యక్షుడు.. ట్రంప్ సంబరం చూసి సైనికాధికారులకు టెన్షన్!


కాగా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 16 ఏళ్ల మోనీ భోన్సలే పూల దండలు అమ్మేందుకు ప్రయాగ్‌రాజ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆమె సహజ సౌందర్యానికి ముగ్ధుడైన ఓ వ్యక్తి ఆమె ఫొటోలు తీసి నెట్టిట పెట్టడంతో ఆమె ఒక్కసారిగా కుంభమేళా మోనాలిసాగా పాప్యులర్ అయిపోయింది. ఇదే క్రమంలో బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ సనోజ్ మిశ్రా దృష్టిలో కూడా ఆమె పడింది. ఆయన తన తదుపరి చిత్రంలో ఈ మోనాలిసాకు ప్రధాన పాత్ర ఆఫర్ చేయబోతున్నారన్న వార్తలు కూడా వెలువడ్డాయి. ఆ తరువాత నుంచి నిత్యం జనాలు ఆమె ఫొటోలు తీసేందుకు మాట కలిపేందుకు, ఇంటర్వ్యూ తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఆమె రోజువారి పనులకు ఆటంకంగా మారుతున్నారు. ఇదే విషయాన్ని ఆమె తాజాగా మీడియాతో పంచుకుంది.

Read Latest and Viral News

Updated Date - Jan 23 , 2025 | 06:33 PM