Cinema : ఇలా బతకడం కష్టం.. తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో రకుల్
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:03 PM
కొన్ని నెలల క్రితం జిమ్‌లో బరువులెత్తుతూ గాయపడిన నటి రకుల్ ప్రీత్‌సింగ్.. షూటింగ్‌లకు దూరంగా ఉన్నా ఇన్‌స్టా ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంది. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్‍లు ఇస్తున్న ఆమె తాజాగా మరో పోస్ట్ చేసింది. ఇన్నాళ్లూ నచ్చిన ఫుడ్ తినలేక ఎంత కష్టపడిందీ చెప్పుకొచ్చింది. భర్త జాకీ భగ్నానీ సాయంతో..

కొన్ని నెలల క్రితం జిమ్‌లో బరువులెత్తుతూ గాయపడిన నటి రకుల్ ప్రీత్‌సింగ్ రెస్ట్ తర్వాత భర్త జాకీ భగ్నానీతో కలిసి లండన్, పారిస్‌లో కొత్త సంవత్సరాన్ని ఆస్వాదిస్తోంది. చాన్నాళ్ల నుంచి గాయం కారణంగా షూటింగ్‌లకు దూరంగా ఉన్న రకుల్.. ఇన్‌స్టా వీడియోల ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంది. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్‍లు ఇస్తూ విభిన్న అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన రీల్‌లో పుడ్ గిల్ట్ అనే సమస్యతో తాను ఎన్ని బాధలు పడిందీ చెప్పుకొచ్చింది. బరువు తగ్గే క్రమంలో లేదా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో క్యాలరీలు పెరగకుండా ఫేవరెట్ డిషెస్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. తానూ అలాంటి ఫీలింగ్‌తోనే సతమతమయ్యానని అంది రకుల్. నచ్చిన ఫుడ్ తినాలనిపించినా ఆ భావాన్ని దూరం పెట్టేందుకు చాలా కష్టపడ్డానని.. ఇయర్ ఎండ్ హాలిడేస్ కోసం భర్త జాకీతో కలిసి చివరికి ఆ బలహీనత ఎలా అధిగమించిందీ తాజా పోస్ట్‌లో తెలిపింది.
ఇష్టమైన పదార్థాలు ఎంత తినాలనిపించినా డైట్ పేరుతో నోరు కట్టేసుకుని సతమతమైపోతుంటారు చాలామంది అమ్మాయిలు. తానూ అలాంటి సమస్యతోనే బాధపడ్డానని రీసెంట్ ఇన్‌స్టా పోస్ట్ ద్వారా పంచుకుంది నటి రకుల్ ప్రీత్ సింగ్. ఇంకా జీవితాన్ని ఆస్వాదించడం, మనల్ని మనం అంగీకరించుకోవడం వంటి అంశాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఇయర్ ఎండ్ హాలిడేస్ వెకేషన్ కోసం భర్త జాకీతో కలిసి లండన్, పారిస్ చుట్టేస్తూ ప్రతి మీల్ ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది రకుల్. నవ్వుతూ చేతిలో కేక్ పట్టుకున్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ""ఈ హాలిడేలో అన్నీ పక్కనపెట్టేసా. ఫుడ్ ఆస్వాదించే విషయంలో ఎప్పుడూ గిల్టీ ఫీలింగ్ ఉండేది. ట్రాక్ తప్పుతాననే ఒత్తిడితో తలతిరిగిపోయేది. మొత్తానికి ఈ సంవత్సరం ఆ ఫీలింగ్ వదిలేయడంతో చాలా సంతోషంగా ఉన్నానని అంది. కష్టమైనా ప్రతిక్షణం జీవిస్తూ అందులో సంతోషాన్ని ఆస్వాదించాలని సూచించింది."
ఫాలోయర్లను ఉద్దేశిస్తూ 'మీరు ఎలా కనిపిస్తున్నారు అనే దానికంటే మీకు ఎలా అనిపిస్తుందనేది ముఖ్యం. ఇతరుల అభిప్రాయాలతో పనిలేకుండా మిమ్మల్ని మీరు అంగీకరించుకోండి. అందుకు ఇదే సరైన సమయం. ఒత్తిడిని పక్కన పెట్టి జ్ఞాపకాలు అందించిన అనుభవాలతో 2025లోకి అడుగుపెట్టండి ' అని పోస్ట్ ద్వారా వెల్లడించింది రకుల్.