Share News

Viral: పసిబిడ్డతో విమాన ప్రయాణం! టేకాఫ్‌లో జాప్యం జరగడంతో..

ABN , Publish Date - Jan 12 , 2025 | 10:55 PM

స్పైస్ జెట్ టేకాఫ్ ఆలస్యం కావడంతో రెండు గంటల పాటు విమానంలోనే పసి పిల్లాడితో ఉండిపోవాల్సి వచ్చిన ప్రయాణికుడు సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడి ట్వీట్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Viral: పసిబిడ్డతో విమాన ప్రయాణం! టేకాఫ్‌లో జాప్యం జరగడంతో..

ఇంటర్నెట్ డెస్క్: విమానం టేకాఫ్ అయ్యేందుకు రెండు గంటల పాటు జాప్యం జరగడంతో పసిబిడ్డతో విమానంలోనే ఉండిపోవాల్సి వచ్చిన ప్రయాణికుడు ఒకరు స్పైస్ జెట్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యల నుంచి ప్రయాణికులకు తక్షణ విముక్తి కల్పించాలంటూ అధికారులను ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ మేరకు ప్రత్యూష్ రావత్ అనే వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

‘‘ఉదయం 6 గంటలకు ఎస్‌జీ263 ఢిల్లీ-కోల్‌కతా విమానంలో ఎక్కాను. ఇప్పటికి రెండు గంటలు గడిచిపోతున్నా విమానం కదలలేదు. ఇక్కడ చిన్నారులు, వృద్ధులు ఉన్నారు. ఇబ్బందులు పడుతున్నారు. కాస్త పద్ధతిలో ప్రణాళిక వేసుకుని ఉంటే ఈ ఆలస్యం జరిగి ఉండేది కాదు. విమానంలోకి ప్రయాణికులను పంపించే ముందే ఎయిర్‌లైన్స్.. ఏటీసీ క్లియరెన్స్ గురించి చెక్ చేసుకున్నాకే బోర్డింగ్‌లోకి తీసుకోవాలి’’ అని ఆగ్రహ వ్యక్తం చేశారు (Viral).


Viral: ఒంటరి మగాళ్లకు ఏఐ గర్ల్ ఫ్రెండ్! ధర చూస్తే షాక్ పక్కా!

‘‘నా ఒళ్లో ఓ పసిబిడ్డ ఉంది. ఈ జాప్యంతో మొత్తం 6 గంటలు ఇబ్బంది ఎదురైంది. దీనికి బదులు లాంజ్‌లో వెయిట్ చేసి ఉంటే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేది. ప్రణాళిక, మేనేజ్‌మెంట్ అస్సలు బాలేదు’’ అని అన్నాడు.

కాగా, రావత్ పోస్టుపై స్పైస్ జెట్ స్పందించింది. అతడికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు పేర్కొంది. తమకు నేరుగా మేసేజీ చేస్తే సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని భరోసా ఇచ్చింది.


Viral: నన్ను తదేకంగా చూడటం నా భార్యకు ఇష్టమే.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ చురక

రావత్ తెలిపిన వివరాల ప్రకారం, ఆరు గంటలకు బయలుదేరాల్సిన విమానం దాదాపు మూడు గంటల ఆలస్యంగా ఉదయం 8.40 గంటలకు బయలుదేరింది. ఈ విషయమై రావత్ డీజీసీఏను కూడా ట్యాగ్ చేశాడు. మంచు సమస్య వస్తుందన్న విషయం సులువుగానే తెలిసిపోతుందని, కాబట్టి, ఈ విషయంలో సంస్థలు పక్కాగా ప్లాన్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Read Latest and Viral News

Updated Date - Jan 12 , 2025 | 10:55 PM