Viral: కుంభమేళాలో మోనాలిసా.. చూపు తిప్పుకోలేని అందం అంటే ఇదే!
ABN , Publish Date - Jan 17 , 2025 | 05:50 PM
సహజసిద్ధమైన అందం, ఎన్నో భావాలను పలికిస్తున్న కళ్లతో కుంభమేళాలో తళుక్కుమన్న ఓ యువతి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమెను నేచురల్ బ్యూటీ అని ప్రశంసిస్తున్న జనాలు యువతిని మోనాలిసాగా పేరు ఖరారు చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: కార్పొరేట్ కల్చర్ వేళ్లూనుకున్న నేటి జమానాలో అనేక మంది తమ రూపురేఖలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. పురుషులు కూడా మేకప్ వేసుకునేందుకు సిద్ధమైపోతున్నారు. ఇక మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే, ఎలాంటి మేకప్ లేకుండా సహజసిద్ధమైన అందంతో మెరిసిపోయేవారు కనిపిస్తే ఓపట్టాను చూపు తిప్పుకోలేము. దీనికి తోడు ముఖంపై ఇదీ అని స్పష్టంగా చెప్పలేని అందమైన భావాలు తొణికిసలాడితే ఇక ఆ అందాన్ని వర్ణించడం మాటలకు అసాధ్యం. ఇప్పుడిదంతా ఎందుకంటే కుంభమేళాలో ఓ యువతి సహజసిద్ధమైన సౌందర్యం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎవరీ నేచురల్ బ్యూటీ అంటూ ఆమెను తెగ పొడిడేస్తున్న జనాలు యువతిని కుంభమేళా మోనాలిసా అని కూడా పిలుస్తున్నారు (Viral)
యువతి ఎవరో ఏమిటో తెలీదు కానీ నెట్టింట ఆమె ఫొటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ముదురు గోధుమ రంగులో ఉన్న కళ్లు, గొప్పకళాకారుడు ఎంతో శ్రద్ధి తీసుకుని తీర్చిదిద్దనట్టు ఉన్న ముఖం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మెడలో రకరకాల పూసల దండలు ధరించి చేతిలో బ్యాగుతో ఆమె ఘాట్ వద్ద ముత్యాల దండలు అమ్ముతూ కనిపించింది.
Viral: విమానాల్లో కొబ్బరిని అనుమతించరు.. ఎందుకంటే..
శివమ్ బికనీర్ అనే ఇన్‌స్టా అకౌంట్‌లో ఆమె ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీడియోలోని కొందరు ఆమెను చూసి ముగ్ధులవడం ఆమె ఎవరో ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నించడం చూడొచ్చు. మరోవైపు యువతిని వీడియోలో రికార్డు చేసేందుకు ఆమె వెంటే సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ వెళ్లడం కొందరికి అస్సలు నచ్చలేదు.
ఇక కొందరు మాత్రం ఆమె సహజసిద్ధమైన సౌందర్యం గొప్పదని అన్నారు. కొందరు ఆమెను కుంభమేళాలో కనిపించిన మోనాలిసాగా అభివర్ణించారు. ఆమె ఓ బ్లాక్ బ్యూటీ అని కొందరు అన్నారు. ఆమె చుట్టూ జనాలు చేరడం కొందరికి అస్సలు నచ్చలేదు. యువతి కల్లల్లోనే అందమంతా దాగుంది అని మరొకరు చెప్పారు.
Viral: పసిబిడ్డతో విమాన ప్రయాణం! టేకాఫ్‌లో జాప్యం జరగడంతో..
అయితే, యువతినే అనుసరించిన ఓ వ్యక్తి ఆమెను పెళ్లైందా అని ప్రశ్నించాడు. ఆమె వెంట ఉన్న వాళ్లంల్లో ఎవరైనా నచ్చారా అని తుంటరి ప్రశ్న వేశారు. కానీ యువతి మాత్రం చాలా హుందాగా సమాధానమిచ్చింది. ఎవరినో ఇష్టపడనని, తన తల్లిదండ్రులు చూసిన వాడినే చేసుకుంటానని చెప్పింది. దీంతో, ఆమె సమాధానం చూసిన జనాలు మరింతగా ప్రశంసలు కురిపించారు.
Viral: అత్త త్వరగా చనిపోవాలంటూ నోటుపై రాసి.. గుడి హుండీలో వేసి..