Viral Video: నిజమైన భర్త అంటే ఇతడే.. పెళ్లి పీటల మీద భార్య ఏడుస్తుంటే అతనేం చేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Feb 08 , 2025 | 08:22 PM
పెళ్లితో అమ్మాయిల జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇంటి పేరు మారడమే కాదు.. తన వాళ్లనందరినీ వదిలేసి కొత్త ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. పుట్టి పెరిగిన ఇంటిని, కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను వదిలి వెళ్లక తప్పదు. ఆ సమయంలో అమ్మాయిలు పడే వేదన అంతా ఇంతా కాదు. దాదాపు అందరూ ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటారు.

పెళ్లి (Wedding) అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అత్యంత మధురమైన ఘట్టం. ముఖ్యంగా పెళ్లితో అమ్మాయిల జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇంటి పేరు మారడమే కాదు.. తన వాళ్లనందరినీ వదిలేసి కొత్త ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. పుట్టి పెరిగిన ఇంటిని, కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను వదిలి వెళ్లక తప్పదు. ఆ సమయంలో అమ్మాయిలు పడే వేదన అంతా ఇంతా కాదు. దాదాపు అందరూ ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ సమయంలో భర్త పక్కనే ఉండి ఆమెను సముదాయిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వరుడు (Groom) ఏం చేశాడో చూడాల్సిందే (Viral Video).
@socialshadi అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ కార్యక్రమం జరుగుతోంది. వధూవరులు పెళ్లి వేదికపై కూర్చున్నారు. వధువు తన కుటుంబ సభ్యులను వదిలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. దాంతో వధువు కన్నీళ్లు పెట్టుకుంది. పక్కనే కూర్చున్న వరుడు కూడా ఎమోషనల్ అయ్యాడు. అతడికి కూడా కన్నీళ్లు వచ్చాయి. అతడు ఎమోషనల్ అయి కన్నీళ్లు తుడుచుకోవడం ఆ వీడియోలో కనిపించింది. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 18 లక్షల మందికి పైగా వీక్షించారు. 7 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అదే నిజమైన ప్రేమ``, ``వరుడు ఇలా ఎమోషనల్ అవడం నేనెప్పుడూ చూడలేదు``, ``భార్య అంటే ఎంత ప్రేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఓర్నీ.. పకోడీలకు ఇంత డిమాండా? ఎలా కొట్టుకుంటున్నారో చూడండి.. వీడియో వైరల్..
Elephant Video: జేసీబీని ఎత్తి పడేసిన ఏనుగు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి