India vs Australia : ‘సెలెక్టర్లే నిర్ణయం తీసుకొంటారు’
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:04 AM
ఆస్ట్రేలియాతో సిరీ్‌స కోల్పోవడంతో పాటు టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు గల్లంతు కావడాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో సిరీ్‌స కోల్పోవడంతో పాటు టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు గల్లంతు కావడాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ ప్రదర్శనపై బోర్డు పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘జట్టు ప్రదర్శనను మెరుగుపరిచే విషయంలో బోర్డు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ ఇద్దరి విషయంలో సరైన సమయంలో సెలెక్టర్లే తగిన నిర్ణయం తీసుకొంటారు. వీరి వరుస వైఫల్యాలపై ప్రత్యేకంగా చర్చిస్తార’ని బోర్డు అధికారి వెల్లడించారు.