Share News

BPL : బీపీఎల్‌లో జీతాల గోల!

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:30 AM

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌)లో నాటకీయ పరిణామం చోటు చేసుకొంది. ఫ్రాంచైజీ దర్బార్‌ రాజ్‌షాహి జీతాలు చెల్లించక పోవడంతో ఆ జట్టును తీసుకెళ్లే బస్సు డ్రైవర్‌ ఆటగాళ్ల కిట్‌లను బస్సులో ఉంచి తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది. తనకు బకాయిపడిన

BPL : బీపీఎల్‌లో జీతాల గోల!

ఆటగాళ్ల కిట్‌లు ఇవ్వనన్న డ్రైవర్‌

బస్సులోనే ఉంచి తాళం

ఢాకా: బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌)లో నాటకీయ పరిణామం చోటు చేసుకొంది. ఫ్రాంచైజీ దర్బార్‌ రాజ్‌షాహి జీతాలు చెల్లించక పోవడంతో ఆ జట్టును తీసుకెళ్లే బస్సు డ్రైవర్‌ ఆటగాళ్ల కిట్‌లను బస్సులో ఉంచి తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది. తనకు బకాయిపడిన జీతాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. ‘ఇదెంతో సిగ్గుపడాల్సిన విషయం. మా జీతం బకాయిలు చాలా ఉన్నాయి. పూర్తి జీతాలు చెల్లిస్తేనే కిట్‌ బ్యాగులు ఇస్తా. ఇకపై నేనిక్కడ పనిచేయాలనుకోవడం లేద’ని ఆ డ్రైవర్‌ విలేకరులతో చెప్పాడు. కొందరు విదేశీ క్రికెటర్లకు కూడా రాజ్‌షాహి జీతాలు ఇవ్వలేదట.


ఇవీ చదవండి:

కెరీర్‌లో కొట్టిన సిక్సులు.. ఒకే మ్యాచ్‌లో బాదేశాడు

ఒక్క ఇన్నింగ్స్‌తో 8 క్రేజీ రికార్డులు.. అభిషేక్ అన్నింటా అసాధ్యుడే

అతడి కోసమే ఈ ఊచకోత.. సీక్రెట్ బయటపెట్టిన అభిషేక్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 04 , 2025 | 04:31 AM