Arshdeep Singh Record: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్.. భువీ, బుమ్రాను దాటేశాడు
ABN , Publish Date - Jan 22 , 2025 | 07:47 PM
IND vs ENG: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సంచలన స్పెల్‌తో చెలరేగిపోయాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో బౌలింగ్‌లో దుమ్మురేపిన ఈ లెఫ్టార్మ్ సీమర్ చరిత్ర సృష్టించాడు.

టీమిండియా పేస్ సెన్సేషన్ అర్ష్‌దీప్ సింగ్ నయా చరిత్ర లిఖించాడు. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఈ లెఫ్టార్మ్ పేసర్ రెచ్చిపోయాడు. స్టన్నింగ్ పేస్ బౌలింగ్‌తో ఇంగ్లీష్ బ్యాటర్లతో ఆడుకున్నాడు. ఆ టీమ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (0), బెన్ డకెట్ (4)ను వరుస ఓవర్లలో ఔట్ చేసి కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో రేర్ ఫీట్ నమోదు చేశాడు అర్ష్‌దీప్. అదేంటో ఇప్పడు చూద్దాం..
పాత రికార్డుకు పాతర!
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (97 వికెట్లు) తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంగ్లండ్‌తో ప్రస్తుత మ్యాచ్‌లో సాల్ట్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడీ పంజాబీ పుత్తర్. ఈ లిస్ట్‌లో ఇంతకుముందు వరకు టాప్‌లో ఉన్న సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (96 వికెట్లు)ను ఈ మ్యాచ్‌తో అధిగమించాడు అర్ష్‌దీప్. 96 వికెట్లు తీసేందుకు చాహల్‌కు 80 మ్యాచులు పట్టగా.. అర్ష్‌దీప్ 62 మ్యాచుల్లో 98 వికెట్లతో కొత్త చరిత్ర సృష్టించాడు. భువనేశ్వర్ కుమార్ (90 వికెట్లు), జస్‌ప్రీత్ బుమ్రా (89 వికెట్లు) ఈ జాబితాలో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. హార్దిక్ పాండ్యా (89 వికెట్లు) ఫిఫ్త్ ప్లేస్‌లో కంటిన్యూ అవుతున్నాడు.
ఇవీ చదవండి:
షమీకి బీసీసీఐ షాక్.. ఇంగ్లండ్‌తో తొలి టీ20కి ముందు..
స్టార్ బౌలర్ కెరీర్ క్లోజ్.. అంతా ప్లాన్ ప్రకారమే
భారత్-ఇంగ్లండ్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ అందులోనే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి