Share News

Karun Nair: 6 మ్యాచుల్లో 5 సెంచరీలు.. ఆర్సీబీ బ్యాటర్ కొత్త చరిత్ర

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:37 PM

వరుసగా రెండు సెంచరీలు కొడితేనే వాటే బ్యాటర్ అంటూ మెచ్చుకుంటారు. అలాంటిది ఓ ప్లేయర్ ఏకంగా 6 మ్యాచుల్లో 5 సెంచరీలు కొట్టాడు. మరి.. ఎవరా క్రికెటర్? అనేది ఇప్పుడు చూద్దాం..

Karun Nair: 6 మ్యాచుల్లో 5 సెంచరీలు.. ఆర్సీబీ బ్యాటర్ కొత్త చరిత్ర
Karun Nair

వరుసగా రెండు సెంచరీలు కొడితేనే వాటే బ్యాటర్ అంటూ మెచ్చుకుంటారు. అలాంటిది ఓ ప్లేయర్ ఏకంగా 6 మ్యాచుల్లో 5 సెంచరీలు కొట్టాడు. నీళ్లు తాగినంత సులువుగా సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. అవతల ఉన్నది ఏ జట్టైనా, బౌలింగ్ చేస్తున్నది ఎంతటి తోపు బౌలరైనా పట్టించుకోకుండా శతకాల మోత మోగిస్తున్నాడు. బౌండరీలు, సిక్సులతో వీరవిహారం చేస్తూ అందర్నీ షేక్ చేస్తున్నాడు. ఆ బ్యాటరే.. టీమిండియా క్రికెటర్ కరుణ్ నాయర్. టీమిండియాకు దూరంగా ఉంటున్న అతడు.. డొమెస్టిక్ క్రికెట్‌లోపరుగుల వరద పారిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా 6 మ్యాచుల్లో 5 సెంచరీలు బాదేశాడు. దీంతో అతడి కెప్టెన్సీలోని విదర్భ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాయర్ టీమ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి నాకౌట్ ఫైట్‌కు క్వాలిపై అయింది.


రికార్డు సమం!

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 82 బంతుల్లో 13 బౌండరీలు, 5 సిక్సుల సాయంతో 122 పరుగులు బాదాడు కరుణ్ నాయర్. ఫోర్ల వర్షం కురిపించిన ఆర్సీబీ మాజీ ఆటగాడు.. వీలు కుదిరినప్పుడు సిక్సులు కూడా బాదాడు. అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా అదరగొడుతున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను బెదిరిస్తూనే.. దూకుడైన సారథ్యంతో జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. 112 నాటౌట్, 44, 163 నాటౌట్, 111 నాటౌట్, 112, 122 నాటౌట్. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో కరుణ్ నాయర్ స్కోర్లు ఇవి. ఒక సీజన్‌లో 5 సెంచరీలు బాదిన బ్యాటర్‌గా ఎన్ జగదీషన్ (2022-23) రికార్డును అతడు సమం చేశాడు.


సెలెక్టర్లపై ప్రెజర్!

వరుస సెంచరీలతో షేక్ చేస్తున్న కరుణ్ నాయర్ సెలెక్టర్ల మీద ఒత్తిడి పెంచుతున్నాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో అతడి విజృంభణతో ఎలాగైనా టీమిండియాలోకి తీసుకోవాలంటూ సెలెక్టర్లపై ఒత్తిడి వస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్ లాంటి స్టార్లు విఫలమవుతుండటంతో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో నాయర్‌ను ఆడించాలనే డిమాండ్లు వస్తున్నాయి. అతడు ఉన్న రెడ్ హాట్ ఫామ్‌కు చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడించాలని కోరుతున్నారు. ఇంత ఫామ్, ఫిట్‌నెస్, అనుభవం ఉన్న ప్లేయర్‌ను ఆడించకపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. కాగా, 2016లో టీమిండియాలోకి అడుగుపెట్టిన నాయర్.. మొత్తం ఆరు మ్యాచుల్లో 374 పరుగులు చేశాడు. అందులో ఇంగ్లండ్ మీద బాదిన ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది.


ఇవీ చదవండి:

కొడుకు బౌలింగ్.. తండ్రి క్యాచింగ్.. క్రికెట్‌ హిస్టరీలో ఎప్పుడూ చూడని సీన్

వాళ్ల రుణం తీర్చుకుంటా.. అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పంత్-జైస్వాల్ మధ్య వార్.. అగ్గిరాజేసింది బీసీసీఐనే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 13 , 2025 | 12:43 PM