Noor Ahmad: సీఎస్‌కే బౌలర్ మ్యాజికల్ డెలివరీ.. బంతిని బొంగరంలా తిప్పేశాడు
ABN , Publish Date - Jan 18 , 2025 | 09:46 AM
SA20: స్పిన్నర్లు టెస్టుల్లో మ్యాజిక్ చేయడం కామనే. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై చెలరేగడం సాధారణమే. కానీ టీ20 లాంటి ఫార్మాట్‌లో బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి వికెట్లపై బంతిని గింగిరాలు తిప్పడం అంత ఈజీ కాదు.

క్రికెట్‌లో ఫార్మాట్ ఏదైనా టీమ్‌లో స్పిన్నర్ ఉండాల్సిందే. టెస్టుల్లో వీళ్ల హవా నడుస్తూ ఉంటుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై బ్యాటర్లతో ఓ ఆటాడుకుంటారు స్పిన్నర్లు. వన్డేల్లోనూ వీళ్ల ప్రాధాన్యతను కొట్టిపారేయలేం. అయితే టీ20 క్రికెట్ మాత్రం స్పిన్నర్లకు కఠిన సవాల్‌ను విసురుతూ ఉంటుంది. బ్యాటర్లు భారీ షాట్లతో బాదుతుంటారు కాబట్టి వాళ్లను ఆపడం చాలా కష్టం. పొట్టి క్రికెట్ కోసం ఎక్కువగా ఫ్లాట్ పిచ్‌లను రెడీ చేస్తారు. కాబట్టి ఎక్కువగా స్పిన్నర్లను టీమ్‌లోకి తీసుకోవడానికి కెప్టెన్స్ ఇష్టపడరు. అయితే కొందరు స్పిన్నర్లు మాత్రం టాప్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొడుతుంటారు. మ్యాజికల్ డెలివరీస్‌తో బ్యాటర్లకు దడ పుట్టిస్తారు.
వాటే డెలివరీ!
పిచ్, బ్యాటర్, కండీషన్స్ లాంటివి పట్టించుకోకుండా స్టన్నింగ్ డెలివరీస్‌తో భయపెట్టే స్పిన్నర్లు ఇంకా క్రికెట్‌లో ఉన్నారు. అలాంటి వారికి ఆఫ్ఘానిస్థాన్ పెట్టింది పేరు. అక్కడి నుంచి రషీద్ ఖాన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ వచ్చాడు. అదే గడ్డ నుంచి వచ్చిన లెఫ్టార్మ్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా ప్రపంచ క్రికెట్‌లో తడాఖా చూపిస్తున్నాడు. తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఓ బ్యూటిఫుల్ డెలివరీతో అందర్నీ మెస్మరైజ్ చేశాడు. గుడ్ లెంగ్త్‌లో ఆఫ్ సైడ్ అతడు వేసిన డెలివరీ కాస్తా పాములా మెలికలు తిరుగుతూ లోపలి వైపునకు దూసుకొచ్చింది. బొంగరంలా తిరుగుతూ దిశను మార్చుకొని బ్యాట్‌ను ఛేదించుకొని వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో షాకైన బ్యాటర్ ఏం జరిగిందంటూ చూస్తూ ఉండిపోయాడు. ఈ ఔట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఈ చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ ప్రత్యర్థులను వణికించడం ఖాయమని అంటున్నారు. ఇలాంటి పిచ్ మీదే ఇంత స్పిన్ చేస్తున్నోడు.. చెపాక్ వికెట్ మీద విశ్వరూపం చూపిస్తాడని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
ఐపీఎల్‌కు రోహిత్-కోహ్లీ దూరం.. స్టార్లపై ఉక్కుపాదం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి