Pakistan vs New Zealand: పాక్‌ను చితగ్గొట్టిన కివీస్ బ్యాటర్.. ఒక్కొక్కర్ని లెక్కబెట్టి ఉతికేశాడు
ABN , Publish Date - Feb 19 , 2025 | 05:39 PM
Will Young: ఓ న్యూజిలాండ్ బ్యాటర్ పాకిస్థాన్ బౌలర్లను చితకబాదాడు. బౌండరీల మీద బౌండరీలు కొడుతూ బౌలింగ్ చేయాలంటే భయపడేలా చేశాడు. ఇంతకీ ఎవరా బ్యాటర్? అనేది ఇప్పుడు చూద్దాం..

చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్‌కు తొలి మ్యాచ్‌లోనే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య వన్డేల్లో బాగా రాణిస్తుండటం, సొంతగడ్డ మీద మెగా టోర్నీ జరుగుతుండటంతో పాక్ ఇరగదీస్తుందని అంతా అనుకున్నారు. కానీ రివర్స్‌లో జరుగుతోంది. మొదటి మ్యాచ్‌లో పాక్‌కు పగటి పూటే చుక్కలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ బ్యాటర్ల బాదుడుకు ఆ టీమ్ బౌలర్లకు మైండ్ బ్లాంక్ అవుతోంది. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ విల్ యంగ్ (111 బంతుల్లో 103 నాటౌట్) సెంచరీతో మెరిశాడు.
క్లాసికల్ షాట్స్‌తో..!
విల్ యంగ్ బౌండరీల మీద బౌండరీలు కొడుతూ పాక్ బౌలర్లకు నరకం చూపించాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడిన యంగ్.. ఒక్కసారి కుదురుకున్నాక చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను లెక్కబెట్టి మరీ అటాక్ చేశాడు. గ్యాప్స్‌లో నుంచి బంతుల్ని తరలించాడు. చెత్త బంతుల్నే గాక మంచి బంతుల్ని కూడా శిక్షించాడు. నసీం షా, హారిస్ రౌఫ్, షాహిన్ అఫ్రిదీ బౌలింగ్‌లో క్లాసికల్ షాట్లతో ఫోర్లు కొట్టాడు విల్ యంగ్. స్పిన్నర్లను కూడా అతడు సమర్థంగా ఎదుర్కొన్నాడు. మరో ఎండ్‌లో సీనియర్ బ్యాటర్ టామ్ లాథమ్ (68 బంతుల్లో 57 నాటౌట్) యంగ్‌కు మంచి సహకారం అందించాడు. ఇద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 118 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. కివీస్ ప్రస్తుతం 37.1 ఓవర్లకు 191 పరుగులతో ఉంది. ఇలాగే ఆడుతూ పోతే ఆ టీమ్ అలవోకగా 320 పరుగులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవీ చదవండి:
అందరి నోటా ఒకటే మాట.. ఆ టీమ్‌దే కప్
టీమిండియాను తలెత్తుకునేలా చేసిన గిల్
ఈ జనరేషన్‌లో అతడే బెస్ట్ ప్లేయర్: యువరాజ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి