PAK vs NZ: సీఎస్కే స్టార్‌కు తీవ్ర గాయం.. మ్యాచ్ మధ్యలోనే రక్తం కక్కుకొని..
ABN , Publish Date - Feb 09 , 2025 | 09:06 AM
CSK: సీఎస్‌కే స్టార్ క్రికెటర్ ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. మ్యాచ్ మధ్యలోనే నెత్తురు కక్కుకున్నాడు. అసలేం జరిగింది? ఏ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది? అనేది ఇప్పుడు చూద్దాం..

న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. లాహోర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ సమయంలో అతడికి ఇంజ్యురీ అయింది. పాక్ ఇన్నింగ్స్‌లో బ్రాస్‌వెల్ వేసిన 37వ ఓవర్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బ్రాస్‌వెల్ వేసిన బంతిని కుష్‌దిల్ షా స్వీప్ కొట్టాడు. అయితే గాల్లోకి లేచిన బంతిని డీప్ మిడ్ వికెట్‌లో ఉన్న రచిన్ క్యాచ్ అందుకోబోయాడు. కానీ లైట్ల వెలుతురులో బంతి వేగం, గమనాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో బంతి అతడి నుదుటిని నేరుగా తాకింది.
మద్దతుగా ఫ్యాన్స్
వేగంగా వచ్చిన బంతి నుదుటికి అంతే బలంగా తాకడంతో రక్తమోడుతూ గ్రౌండ్‌ను వీడాడు రచిన్ రవీంద్ర. బంతి తగలగానే నొప్పితో అతడు విలవిల్లాడాడు. మోకాళ్ల మీద అలా కూర్చుండిపోయాడు. దీంతో కివీస్ ఆటగాళ్లు, పాక్ ప్లేయర్లతో పాటు స్టేడియంలోని అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే వెంటనే అక్కడికి చేరుకున్న మెడికల్ టీమ్ రచిన్‌ను డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. మైదానాన్ని వీడుతున్న కివీస్ స్టార్‌కు ప్రేక్షకులు చప్పట్లతో సపోర్ట్‌గా నిలిచారు. నువ్వో ఫైటర్‌వి అంటూ ప్రశంసించారు. ఈ వీడియో చూసిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్.. రచిన్ త్వరగా కోలుకో అంటూ ధైర్యం నింపుతున్నారు. వచ్చే ఐపీఎల్‌లో కుమ్మేయాలని.. ఇలాంటి గాయాలు నీ జోరుకు బ్రేకులు వేయలేవని కామెంట్స్ చేస్తున్నారు.
పాక్ ఓటమి!
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 330 పరుగుల భారీ స్కోరు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (74 బంతుల్లో 106 నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. డారిల్ మిచెల్ (81), కేన్ విలియమ్సన్ (58) కూడా సత్తా చాటారు. ఆ తర్వాత చేజింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 47.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. ఫఖర్ జమాన్ (84), సల్మాన్ అలీ అఘా (40) రాణించినా చేదించాల్సిన స్కోరు ఎక్కువ ఉండటం, మిగతా బ్యాటర్లు ఫెయిల్ అవడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు.
ఇవీ చదవండి:
ఇక నుంచి.. జూనియర్లకు నజరానాల్లేవ్!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి