Share News

Chahal-Dhanashree: చాహల్ సంసారంలో నిప్పులు పోశాడు.. ఎవరీ ప్రతీక్..

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:20 PM

Yuzvendra Chahal: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనశ్రీ వర్మతో అతడు విడాకులకు సిద్ధమవుతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Chahal-Dhanashree: చాహల్ సంసారంలో నిప్పులు పోశాడు.. ఎవరీ ప్రతీక్..
Yuzvendra Chahal Dhanashree Verma Divorce

Team India: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనశ్రీ వర్మతో అతడు విడాకులకు సిద్ధమవుతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అటు చాహల్, ఇటు ధనశ్రీ ఒకర్నొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌‌ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. వీళ్లు డివోర్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారని.. త్వరలో అధికారికంగా ప్రకటన చేస్తారని క్రికెట్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ తరుణంలో మరో వ్యక్తితో ధనశ్రీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ వ్యక్తే చాహల్ సంసారంలో నిప్పులు పోశాడని అంటున్నారు. ఇంతకీ ఎవరతను? చాహల్-ధనశ్రీ మధ్యలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం..


ఎవరీ ప్రతీక్ ఉటేకర్?

చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ కొన్ని నెలల కింద తన ఫ్రెండ్ ప్రతీక్ ఉటేకర్‌తో కలసి కొన్ని ఫొటోలు దిగింది. అందులో వాళ్లిద్దరూ కాస్త సన్నిహితంగా కనిపించారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏమైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే చాహల్‌తో రిలేషన్‌ బాగానే ఉండటంతో ఈ ఫొటోల్ని అంతా లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు చాహల్-ధనశ్రీ విడాకుల వార్తతో కొరియోగ్రాఫర్ ప్రతీక్ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. అతడే స్టార్ క్రికెటర్ సంసారంలో నిప్పులు పోశాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ధనశ్రీతో అంత దగ్గరగా దిగిన ఫొటోలను బట్టి వాళ్ల రిలేషన్ ఏంటో అర్థమవుతోందని అంటున్నారు. అయితే ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నా అటు చాహల్ నుంచి గానీ ఇటు ధనశ్రీ నుంచి గానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో వీళ్లు డివోర్స్ తీసుకుంటున్నారనే రూమర్స్ మరింత ఎక్కువవుతున్నాయి.


డిలీట్ చేయడంతో..

ప్రతీక్ సంగతి కాస్త అటుంచితే.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకర్నొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో చాహల్-ధనశ్రీ డివోర్స్ మీద వార్తలు ఎక్కువయ్యాయి. చాహల్ తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి ధనశ్రీ వర్మ ఫొటోలను డిలీట్ చేసేశాడు. దీంతో ఈ క్రేజీ కపుల్ విడిపోతారనే ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే చాహల్‌ను అన్‌ఫాలో చేసినప్పటికీ అతడితో దిగిన ఫొటోలను మాత్రం డిలీట్ చేయలేదు ధనశ్రీ. ఇద్దరూ డివోర్స్ తీసుకోవడం ఖాయం, ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసేందుకు కాస్త సమయం పడుతుందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇంత లవ్లీ కపుల్ ఎందుకు విడిపోతున్నారనే దానికి కారణాలు మాత్రం తెలీదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.


ఇవీ చదవండి:

టీమిండియా ఆల్‌రౌండర్ రిటైర్మెంట్.. దేశవాళీల్లో ఇతనో లెజెండ్

స్టార్ హీరోయిన్ పోస్ట్.. రోహిత్ శర్మ భార్యపై భారీ ట్రోలింగ్

టీమిండియాను అవమానించిన ఆసీస్.. మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తారా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2025 | 01:27 PM