రో-కోలకు చివరి చాన్స్
ABN , Publish Date - Feb 19 , 2025 | 03:35 AM
హోరాహోరీ మ్యాచ్‌ల సంగతి పక్కనబెడితే ఈ టోర్నీ పలువురు ఆటగాళ్లకు చివరి అవకాశంగా భావిస్తున్నారు. ఈ జాబితాలో భారత కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ముందుంటారు...

హోరాహోరీ మ్యాచ్‌ల సంగతి పక్కనబెడితే ఈ టోర్నీ పలువురు ఆటగాళ్లకు చివరి అవకాశంగా భావిస్తున్నారు. ఈ జాబితాలో భారత కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ముందుంటారు. వన్డే కెరీర్‌లో ఈ జోడీ చివరి దశలో ఉన్నారనేది వాస్తవం. ఈ టోర్నీ తర్వాత కూడా ఇద్దరూ వన్డే జట్టులో కొనసాగుతారా? అంటే చెప్పడం కష్టమే. అలాగే సీటీలో ప్రదర్శన ఆధారంగానే అటు టెస్టు జట్టులోనూ వీరి స్థానంపై ఓ అంచనాకు రావచ్చనేది విశ్లేషకుల భావన. ఇటీవలి కాలంలో రోహిత్, విరాట్ ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కానీ ఇంగ్లండ్‌తో సిరీస్ హిట్‌మ్యాన్ శతకం, విరాట్ అర్ధసెంచరీ వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ కీలక సమరంలో వారి బ్యాట్ల నుంచి అద్భుత ఇన్నింగ్స్ నమోదు కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read:
నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి
మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు..
2 విడతల్లో డీఏ..? భారీ పెరగనున్న పెన్షన్లు, జీతాలు..!
For More Andhra Pradesh News and Telugu News..