క్వార్టర్స్ చేరేదెవరో?
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:49 AM
రంజీ ట్రోఫీ లీగ్ దశ తుది అంకానికి చేరుకొంది. విదర్భ మాత్రమే నాకౌట్ చేరుకోగా.. క్వార్టర్స్ బెర్త్ కోసం ఏడు జట్లు పోటీపడుతుండడంతో గురువారం నుంచి జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ ఆయా జట్లకు...

నేటి నుంచి రంజీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లు
ప్రత్యేక ఆకర్షణగా కోహ్లీ
న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీ లీగ్ దశ తుది అంకానికి చేరుకొంది. విదర్భ మాత్రమే నాకౌట్ చేరుకోగా.. క్వార్టర్స్ బెర్త్ కోసం ఏడు జట్లు పోటీపడుతుండడంతో గురువారం నుంచి జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ ఆయా జట్లకు కీలకంగా మారింది. ఇక, ఢిల్లీ తరపున 12 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడనుండడం ప్రత్యేక ఆకర్షణ. గ్రూప్-డిలో ఢిల్లీ నాకౌట్ అవకాశాలు చాలా స్పల్పంగా ఉన్నాయి. ఆ టీమ్ క్వార్టర్స్ చేరాలంటే రైల్వే్‌సపై బోనస్ పాయింట్‌తో గెలవడంతోపాటు మిగతా జట్ల ఫలితాల కోసం వేచిచూడాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌కు కోహ్లీ కోసం అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. టాప్-3లో తమిళనాడు (25 పాయింట్లు), చండీగఢ్ (19 పాయింట్లు), సౌరాష్ట్ర (18 పాయింట్లు) మధ్యే ఆసక్తికర పోటీ నెలకొంది. ఇక, గ్రూప్-ఎలో డిఫెండింగ్ చాంప్ ముంబై పరిస్థితి క్లిష్టంగా ఉంది.
టేబుల్ టాపర్‌గా ఉన్న జమ్మూ కశ్మీర్ (29 పాయింట్లు) కేవలం ఒక్క పాయింట్ సాధిస్తే నాకౌట్‌కు చేరుకొంటుంది. ఇక, రెండో స్థానంలో ఉన్న బరోడా (27 పాయింట్లు) తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధిస్తే చాలు. గ్రూప్-బిలో పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. విదర్భ ఈపాటికే క్వార్టర్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ మధ్య నాకౌట్ కాని నాకౌట్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లలో ఎవరు నెగ్గితే వారు రౌండ్-8లోకి అడుగుపెడతారు. ఇక, గ్రూప్-సిలో త్రిముఖ పోరు నెలకొంది. క్వార్టర్స్ బెర్త్‌ల కోసం హరియాణా (26 పాయింట్లు), కేరళ (21 పాయింట్లు), కర్ణాటక (19 పాయింట్లు) మధ్య తీవ్ర పోటీనెలకొంది.
ఆధార్‌తో ఎంట్రీ ఫ్రీ..
రైల్వే్‌సతో మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున విరాట్ బరిలోకి దిగనుండడంతో భారీగా ఫ్యాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది. తొలి రోజు ఆట చూసేందుకు దాదాపు 10 వేల మంది వస్తారని ఢిల్లీ క్రికెట్ సంఘం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో ఉచిత ప్రవేశం అని ప్రకటించిన డీడీసీఏ.. ఆధార్ కార్డ్‌ను మాత్రం తప్పకుండా తీసుకురావాలనే షరతు విధించింది. జియో సినిమాలో మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది
అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి