Share News

WPL 2025: నేడే ఉమెన్స్ ఐపీఎల్ ప్రారంభం.. ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే

ABN , Publish Date - Feb 14 , 2025 | 10:18 AM

క్రికెట్ క్రీడాభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మూడో ఎడిషన్ నేటి (ఫిబ్రవరి 14న) నుంచి ప్రారంభమవుతుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

WPL 2025: నేడే ఉమెన్స్ ఐపీఎల్ ప్రారంభం.. ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే
WPL 2025 3rd Season

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఉత్కంఠ కలిగించే ఐపీఎల్ (WPL 2025) సీజన్ మళ్లీ రానే వచ్చింది. కానీ ఇది పురుషుల ఐపీఎల్ కాదు. మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (WPL) మూడో సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతోంది. ఈరోజు రాత్రి 7:30 గంటలకు WPL 2025 సీజన్ మొదలవుతుంది. మొదటి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్(Gujarat Giants), రాయల్ ఛాలెంజర్స్(Royal Challengers) మధ్య గుజరాత్‌లోని వడోదర ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.


ఉమెన్స్ ఐపీఎల్

ఈసారి WPL సీజన్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు జరుగుతాయి. WPL 2025 సీజన్‌లో మొదట గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు పోటీ పడతాయి. గుజరాత్ జెయింట్స్‌కు ఆష్లీ గార్డనర్ నాయకత్వం వహిస్తుండగా, రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు స్మృతి మంధాన కెప్టెన్సీగా ఉన్నారు. రెండు జట్లూ సమర్థమైన ఆటగాళ్లతో సన్నద్ధంగా ఉన్నాయి. ఈ మ్యాచుల్లో భాగంగా ఆయా జట్లలో దేశంతోపాటు విదేశీ క్రీడాకారులు కూడా ఉన్నారు. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారని ఆసక్తితో ఉన్నారు.


ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ

ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా డిస్నీ హాట్‌స్టార్ ద్వారా చూడవచ్చు. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వడోదరలో జరగనున్న ఈ మ్యాచ్‌లో వాతావరణం బాగుంటుందని భావిస్తున్నారు. వర్షం పడే అవకాశం లేదు. కానీ రాత్రి సమయంలో స్వల్పంగా చలిగాలులు వీచే అవకాశం ఉంది.


పిచ్ ఎలా ఉంది..

ఈ క్రికెట్ స్టేడియం కోటంబి స్టేడియంగా ప్రసిద్ధి చెందింది. ఇది కొత్తగా నిర్మించబడిన మైదానం కాగా, వడోదర స్టేడియంలో ఉన్న పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. గణాంకాల ప్రకారం మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం సులభం కానీ, రెండో ఇన్నింగ్స్‌లో ఛేజింగ్ చేయడం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో ప్రతి జట్టు ఒకదానితో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. వడోదర స్టేడియంలో జట్లు సమానంగా పోటీపడతాయి. ఈ సిరీస్ ఫిబ్రవరి 14 నుంచి మార్చి 11 వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య గట్టి పోటీ ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే గతంలో ఈ రెండు జట్ల మధ్య నాలుగు మ్యాచులు జరిగితే, చెరో రెండు గెల్చుకున్నాయి.


రాయల్ ఛాలెంజర్స్ జట్టు

రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఆటగాళ్లలో డానీ వ్యేత్ హాడ్జ్, స్మృతి మంధాన(C), సబ్బినేని మేఘన, జార్జియా వేర్‌హామ్, చార్లీ డీన్, హీథర్ గ్రాహం, కనికా అహుజా, రాఘవి బిష్ట్, రిచా ఘోష్, నజత్ పర్వీన్, ఆశా శోభన, ఏక్తా బిష్ట్, జాగ్రివి పవార్, వీజే జోషిత, కిమ్ గ్రాత్, ప్రేమ రావత్, రేణుకా సింగ్, శ్రేయంకా పాటిల్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు కలరు.

గుజరాత్ జెయింట్స్ జట్టు

గుజరాత్ జెయింట్స్ జట్టులో ఆష్లీ గార్డనర్ (C), లారా వోల్వార్డ్ట్, హర్లీన్ డియోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ (WK), ప్రియా మిశ్రా, సయాలీ సత్‌ఘరే, మేఘనా సింగ్, మన్నత్ కశ్యప్, దయాళన్ హేమలత, మన్నత్ కశ్యప్ వంటి ఆటగాళ్లు కలరు.


ఇవి కూడా చదవండి:

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు


Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి థాంక్స్ చెప్పిన ప్రధాని మోదీ.. కారణం ఇదే


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్


8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 14 , 2025 | 10:21 AM