Share News

యువ భారత్‌ సూపర్‌ బోణీ

ABN , Publish Date - Jan 20 , 2025 | 05:32 AM

డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచక్‌పను అద్భుతంగా ఆరంభించింది. గ్రూప్‌-ఎలో భాగంగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో బోణీ కొడుతూ...

యువ భారత్‌ సూపర్‌ బోణీ

44కే కూల్చేశారు

విండీ్‌సపై 9 వికెట్లతో గెలుపు

అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌

కౌలాలంపూర్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచక్‌పను అద్భుతంగా ఆరంభించింది. గ్రూప్‌-ఎలో భాగంగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో బోణీ కొడుతూ 9 వికెట్లతో వెస్టిండీ్‌సను చిత్తుగా ఓడించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ మహిళలు.. భారత లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు పరునిక సిసోడియా (3/7), జోషిత (2/5), ఆయుషి శుక్లా (2/6) ధాటికి 13.2 ఓవర్లలో 44 పరుగులకే కుప్పకూలారు. స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళలు 4.2 ఓవర్లలోనే 47/1 స్కోరు చేసి అలవోకగా ఛేదించారు. తెలుగమ్మాయి, ఓపెనర్‌ గొంగడి త్రిష (4) నిరాశపరిచినా.. మరో ఓపెనర్‌ కమలిని (16 నాటౌట్‌), సనిక చల్కే (18 నాటౌట్‌) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. భారత్‌ రెండో మ్యాచ్‌ను మలేసియాతో మంగళవారం ఆడనుంది.


మలేసియా 23 పరుగులకే..: గ్రూప్‌-ఎలోనే జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంక మహిళలు 139 పరుగుల తేడాతో ఆతిథ్య మలేసియాను చిత్తుచేశారు. తొలుత లంక 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఛేదనలో లంక భీకరమైన బౌలింగ్‌ ధాటికి మలేసియా 14.1 ఓవర్లలో 33 పరుగులకే ఆలౌటైంది.

వెస్టిండీస్‌: 13.2 ఓవర్లలో 44 ఆలౌట్‌ (కాసర్‌ 15, అసబి 12; పరునిక 3/7, జోషిత 2/5, ఆయుషి 2/6);

భారత్‌: 4.2 ఓవర్లలో 47/1 (సనిక 18 నాటౌట్‌, కమలిని 16 నాటౌట్‌).

Updated Date - Jan 20 , 2025 | 05:32 AM