Google Maps Without Internet : నెట్ లేకున్నా గూగుల్ మ్యాప్స్ వాడేయండి.. సింపుల్ ట్రిక్.. చాలా తక్కువ మందికే తెలుసు..
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:50 PM
Google Maps Without Internet : గూగుల్ మ్యాప్స్ ద్వారా రూట్స్ చూసుకుంటూ తెలియని ప్రాంతానికి వెళుతుంటాం. సడన్‌గా కొన్ని చోట్ల నెట్ సరిగా రాదు. లేకపోతే ఫోన్‌లో నెట్ బ్యాలెన్స్ అయిపోయి ఉండవచ్చు. అప్పుడు ఎలా వెళ్లాలో తెలియక తికమకపడుతుంటాం. ఇక నుంచి ఆ భయం అక్కర్లేదు. ఈ ట్రిక్ వాడి ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్‌లో మీరు రూట్ సులభంగా చూడవచ్చు. అదెలాగంటే..

Google Map Tricks : ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే యాప్‌లలో గూగుల్ మ్యాప్స్ ఒకటి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎవరి గైడెన్స్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్ వల్లే ఏ ప్రాంతానికైనా సులభంగా చేరుకోగలుగుతున్నారు. కానీ, ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ వాడాలంటే ఇంటర్నెట్ తప్పనిసరి. డ్రైవింగ్ చేసే సమయంలో మారుమూల ప్రాంతానికి వెళ్లినపుడు సిగ్నల్స్ సరిగా ఉండకపోవడం సహజం. కొన్నిసార్లు హఠాత్తుగా నెట్ బ్యాలెన్స్ కూడా అయిపోయి సిగ్నల్ గూగుల్ మ్యాప్ పనిచేయడం ఆగిపోవవచ్చు. అయితే, నెట్ రాకపోయినా యూజర్ సులభంగా గూగుల్ మ్యాప్స్ వాడుకునేందుకు ఈ యాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ స్పెషల్ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ లేకుండానే లొకేషన్ యాక్సెస్ చేసి గమ్యాన్ని చేరుకోవచ్చు.
గూగుల్ మ్యాప్స్ ప్రత్యేక ఫీచర్ వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. ఇష్టమైన ప్రదేశానికి చేరుకోవడానికి ప్రతిసారీ మ్యాప్స్‌లో లొకేషన్ అడ్రస్ నమోదు చేయవలసిన అవసరం లేదు. దీని ద్వారా మీరు Google Mapsలో మీకు నచ్చిన లొకేషన్ సేవ్ చేసుకోగలుగుతారు. ఇంటర్నెట్ లేకపోయినా లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్నా కూడా మీ రూట్ యాక్సెస్ చేయగలరు.
Google Maps ని ఆఫ్‌లైన్‌లో ఎలా ఉపయోగించాలి?
ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్‌లో గూగుల్ మ్యాప్ యాప్‌ను తెరవండి. ఆ సమయంలో మీ పరికరం ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి Google మ్యాప్స్‌కి సైన్ ఇన్ అయిందో లేదో నిర్ధారించుకోవాలి.
ఇప్పుడు మీరు వెళ్లాలనుకుంటున్న ప్రదేశాన్ని సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ చేసి డెస్టినేషన్ ఐకాన్‌పై లాంగ్ ప్రెస్ చేయండి. తర్వాత కుడి వైపున కనిపించే త్రీ డాట్స్ క్లిక్ చేస్తే ఆఫ్‌లైన్ మ్యాప్‌ను డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. అంతే. ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోయినా మీరు సేవ్ చేసుకున్న లొకేషన్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోగలుగుతారు. అయితే, ఇంటర్నెట్ లేకుండా ఏ సమయంలోనైనా ఎంత ట్రాఫిక్ ఉందో మీరు కనుగొనలేరు.
Google Mapsలో మల్టిపుల్ లొకేషన్స్ సేవ్ చేయండి..
Android లేదా iPhone లో Google Maps తెరవండి.
Google మ్యాప్‌లో సేవ్ చేయాలనుకుంటున్న లొకేషన్ ఓపెన్ చేయండి.
దాని కింద ఉన్న సేవ్ బటన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు ప్రైవేట్, ఇష్టమైన ప్లేస్, ట్రావెల్ ప్లానింగ్ నుంచి ఏదైనా ఎంచుకోవచ్చు.
ఈ విధంగా మీరు Google Mapsలో స్థానాన్ని సేవ్ చేయవచ్చు.
ఇవి కూడా చదవండి..
Sundar Pichai: టెక్ రంగంలో ఏఐ తరువాత రాబోయే విప్లవం ఏదో చెప్పిన గూగుల్ సీఈలో
WhatsApp: వాట్సాప్ సరికొత్త ఫీచర్.. త్వరలోనే..
మరిన్ని సాంకేతిక, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..