Share News

Hyderabad: మాధవి కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులు ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:24 PM

Hyderabad News: మాధవి మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాధవిని ఆమె భర్తే చంపాడని జరుగుతున్న ప్రచారంపై పోలీసులు కీలక కామెంట్స్ చేశారు. మరి పోలీసులు ఏం అన్నారు.. ఆ కేసులో చోటు చేసుకున్న ట్విస్ట్ ఏంటి.. ఈ కథనంలో తెలుసుకుందాం..

Hyderabad: మాధవి కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులు ఏం చెప్పారంటే..
Madhavi Missing Case

హైదరాబాద్, జనవరి 23: మీర్‌పేట్‌లో మాధవి మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులు కీలక ప్రకటన చేశారు. వెంకట మాధవి కేసుపై విచారణ జరుగుతోందని ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసును మిస్సింగ్ కేసుగానే తాము విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసులో బయట జరుగుతున్న చర్చ ప్రకారం తమ వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎస్ఐ తెలిపారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వెంకట మాధవి తల్లి, కుటుంబ సభ్యులు తమ కూతురిని భర్తే హత్య చేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కోణంలోనూ తాము దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. మాధవి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి చెరువులో పడేసినట్లు ఇంకా ఆధారాలు దొరకలేదన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో మాత్రం వెంకట మాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయని.. ఇంటి నుండి బయటకు వచ్చినటువంటి దృశ్యాలు లేవని ఎస్ఐ వెల్లడించారు. వెంకట మాధవిని భర్త గురుమూర్తి హత్య చేసినట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారన్న ఎస్ఐ.. దీనిపై సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.


అసలేం జరిగింది..

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌‌పేట్‌లో నివాసం ఉంటుంన్న గురుమూర్తి.. తన భార్య మాధవిని అత్యంత కిరాతకంగా చంపినట్లు ప్రచారం జరిగింది. గురుమూర్తి తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి, కుక్కర్‌లో ఉడకబెట్టి.. ఆపై కాల్చి బూడిద చేశాడని, ఆ బూడిదను జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు ప్రచారం జరిగింది. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, బయట ప్రచారం జరుగుతున్నట్లుగా అలాంటి ఆధారాలేమీ ఇంకా లభించలేదని పోలీసులు చెబుతున్నారు. మరి మాధవి మిస్సింగ్ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.


Also Read

కోహ్లీకి సూర్య సవాల్!

రికార్డుస్థాయిలో తెలంగాణకు పెట్టుబడులు..

ట్రంప్ ప్రాణాలు కాపాడిన ఏజెంట్‌కు బంపరాఫర్..

For More Telangana News and Telugu News..

Updated Date - Jan 23 , 2025 | 04:24 PM