Share News

CP CV Anand: హైదరాబాద్ సిటీ పోలీస్ వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం

ABN , Publish Date - Jan 20 , 2025 | 10:30 AM

హైదరాబాద్: సిటీ పోలీస్ వార్షిక క్రీడా పోటీలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్ పాల్గొని పోటీలను ప్రారంభించారు.

CP CV Anand: హైదరాబాద్ సిటీ పోలీస్ వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం
CP CV Anand

హైదరాబాద్: సిటీ పోలీస్ వార్షిక క్రీడా పోటీలు (City Police Annual Sports Competitions) సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్ (Saina Nehwal), కశ్యప్ (Kashyap) పాల్గొని పోటీలను ప్రారంభించారు. గోషామహల్‌లోని శివకుమార్ లాల్ పోలీస్ స్టేడియంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025 వార్షిక స్పోర్ట్స్, గేమ్స్ మీట్‌లో 14 టీమ్‌లు పోటీలో పాల్గొంటున్నాయని, హైదరాబాద్ సిటీ పోలీసుల 14 టీమ్‌లు పాల్గొనడం ఇదే మొదటిసారి అని చెప్పారు. కార్యక్రమం ప్రారంభించిన సైనా నెహ్వాల్, కశ్యపులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి..

పోలీసులపై మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు


మనలో పోటీతత్వం ఉండాలి

తానుట్రాఫిక్ అడిషనల్‌లో ఉన్నప్పుడు ట్రాఫిక్ స్కూల్ కమాండర్స్ ప్రోగ్రాంకు సైనా నెహ్వాల్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారని, సైనా పద్మభూషణ్ గ్రహీతని.. అందరూ ఆమెను చూసి ఇన్‌స్పైర్ అవ్వాలని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. స్పోర్ట్స్, గేమ్స్ మీట్ ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరగవలసిందేనని, పదేళ్లపాటు పోలీస్ స్పోర్ట్స్ మీట్ కాలేదని, పోలీస్ డ్యూటీ మీట్ కాలేదని అన్నారు. స్పోర్ట్స్ మీట్ మోటివేషన్‌తో పాటు వాళ్లలోని నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. స్పోర్ట్స్‌లో పాల్గొనడం సమయం వృధా అనుకునే వాళ్ళు ఆ ఆలోచన నుంచి బయటికు రావాలన్నారు. ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేస్తామని, కానీ టీమ్‌లు ఎక్కువగా ఉండటంవల్ల ఈసారి నాలుగు రోజులపాటు నిర్వహిస్తున్నామన్నారు. తాను కూడా ఒకప్పుడు స్పోర్ట్స్ మెన్‌నని, ఆటల్లో ఓడిపోతే ఆ రాత్రి తనకు నిద్ర పట్టేది కాదన్నారు. మనలో పోటీతత్వం ఉండాలని, ఈ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో ఇది ఆఖరి స్పోర్ట్స్ మీట్‌అని అన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉస్మానియా ఆస్పత్రి కట్టబోతున్నారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.


కాగా ఈ నెల 18న వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసు క్రీడా పోటీలు హనుమకొండ జేఎన్‌ఎస్‌లో అట్టహాసంగా జరిగాయి. పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. ఈ పోటీల్లో కమిషనరేట్‌ పరిధిలోని ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌ జోన్లలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి మూడు రోజులు 12 క్రీడల్లో పోటీలు నిర్వహించామన్నారు. క్రీడా పోటీలతో దేహ దారుఢ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుందని, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, పని ఒత్తిడిని అధిగమించడానికి ఇవి దోహదపడుతాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ చాటిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.. మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్వహించిన 8 వందల పరుగుపందెం, వాలీబాల్‌ పోటీలను సీపీ ప్రారంభించారు. అదేవిధంగా వాలీబాల్‌ క్రీడలు సెయింట్‌ గ్యాబ్రియల్‌ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

తిరుమలలో సోమవారం నుంచి యధావిధిగా దర్శనాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 20 , 2025 | 10:30 AM