Manchu Manoj: మంచు ఫ్యామిలీ పంచాయితీ.. ఆ అధికారితో మనోజ్ కీలక భేటీ
ABN , Publish Date - Jan 18 , 2025 | 03:31 PM
Manchu Manoj: రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్‌తో మంచు మనోజ్ భేటీ అయ్యారు. భూతగాదాల విషయంలో అదనపు కలెక్టర్‌ను మనోజ్ కలిశారు. ఆస్తులకు సంబంధించి మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మనోజ్‌కు కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగానే అడిషనల్ కలెక్టర్ ముందు విచారణకు హాజరయ్యారు మంచు మనోజ్.

హైదరాబాద్, జనవరి 18: గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ముఖ్యంగా మంచు మోహన్‌బాబు(Manchu Mohan Babu), విష్ణు (Vishnu).. మనోజ్‌ల(Manoj) మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్‌తో మంచు మనోజ్ భేటీ అయ్యారు. భూతగాదాల విషయంలో అదనపు కలెక్టర్‌ను మనోజ్ కలిశారు. కాగా.. జల్‌పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని జిల్లా మెజిస్ట్రేట్‌కు మంచు మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. తన ఆస్తిలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేయించి, తనకు అప్పగించాలని మోహన్ బాబు కోరారు.
గత కొన్ని రోజులుగా మోహన్ బాబు తిరుపతిలోనే ఉంటున్నారు. జల్‌పల్లిలోని ఇంట్లో మంచు మనోజ్ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్ ఆక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. మోహన్ బాబు ఫిర్యాదుపై జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న కలెక్టర్ స్పందించారు. పోలీసుల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న కలెక్టర్.. జల్‌పల్లి ఇంటిలో ఉంటున్న మంచు మనోజ్‌కు నోటీసు ఇచ్చారు. ఈ నోటీసు మేరకు మంచు మనోజ్.. ఈరోజు అడిషనల్ కలెక్టర్ ముందు విచారణకు హాజరయ్యారు. కొంత సమాచారాన్ని కూడా మంచు మనోజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మంచు మనోజ్ మాట్లాడే అవకాశం ఉంది. అయితే జల్‌పల్లి ఘటనతో పాటు ఇటీవల తిరుపతిలో జరిగిన వివాదాలపై మంచు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్ పరస్పరం ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి ఎవరో తేల్చిన కోర్టు
మోహన్‌బాబు, విష్ణు ఒకటిగా ఉండిగా ఫిర్యాదు చేయగా.. మనోజ్ సింగిలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదులపై పోలీసులు కూడా విచారణ చేశారు. ఇప్పుడు తాజాగా కలెక్టర్ ఇచ్చిన నోటీసులపై మంచు మనోజ్ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మనోజ్ విషయంలో కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు.. జల్‌పల్లిలో ఇంటి ఖాళీ చేయిస్తారా లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే విచారణ తర్వాత మనోజ్ స్పందన ఏంటి అనేది కూడా ఉత్కంఠగా మారింది.
ఇవి కూడా చదవండి..
ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు
Read Latest Telangana News And Telugu News