Share News

Mohan Babu: ట్విస్ట్‌ ఇచ్చిన మోహన్ బాబు.. మనోజ్ స్పందన ఏంటో

ABN , Publish Date - Jan 18 , 2025 | 02:19 PM

Mohan Babu: మంచు ఫ్యామిలీలో రోజుకో ట్విస్ట్ బయటపడుతూనే ఉంది. తాజాగా ఆస్తులకు సంబంధించి మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు మంచు మోహన్‌బాబు. తన ఆస్తుల్లో ఉన్న అందర్నీ వెకేట్ చేయించాలంటూ జిల్లా మెజిస్ట్రేట్‌కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Mohan Babu: ట్విస్ట్‌ ఇచ్చిన మోహన్ బాబు.. మనోజ్ స్పందన ఏంటో
Manchu Mohan Babu

హైదరాబాద్, జనవరి 18: మంచు ఫ్యామిలీలో (Manchu Family) మంటలు తగ్గేలా కనిపించడం లేదు. రోజుకో అంశంపై మంచు కుటుంబంలో గొడవలు బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవల తిరుపతిలో మోహన్‌ బాబు (Manchu Mohan babu) కాలేజ్‌ వద్ద వివాదం గురించి మరువక ముందే మంచు ఫ్యామిలీలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆస్తులకు సంబంధించి మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు మోహన్‌బాబు. తన ఆస్తుల్లో ఉన్న అందర్నీ వెకేట్ చేయించాలంటూ జిల్లా మెజిస్ట్రేట్‌కు మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.


తన ఆస్తిలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేయించి, తనకు అప్పగించాలని మోహన్ బాబు కోరారు. గత కొన్ని రోజులుగా మోహన్ బాబు తిరుపతిలోనే ఉంటున్న విషయం తెలిసిందే. జల్‌పల్లిలోని ఇంట్లో మంచు మనోజ్ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్ ఆక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. మోహన్ బాబు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించారు. పోలీసుల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న కలెక్టర్.. జల్‌పల్లిలో ఇంటిలో ఉంటున్న మంచు మనోజ్‌కు నోటీసు ఇచ్చారు. ఈ నోటీసుపై మనోజ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Gunfire Case: హైదరాబాద్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు


కాగా... కాసేపటి క్రితమే తన అన్న మంచు విష్ణును ఉద్దేశిస్తూ మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇన్ని రోజులు జరుగుతున్న వివాదలకు తెర వేసే విధంగా మనోజ్ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘రండి ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. నేను ఒక్కడినే వస్తాను ఏ ప్లేస్ కైనా వస్తాను. ఎవర్నో అడ్డం పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నాన్నని, మహిళ, సిబ్బందిని అడ్డం పెట్టుకొని మాట్లాడవలసిన అవసరం లేదు. మన వద్ద ఉన్న సమస్యని ఒక పరిష్కారం తీసుకొని వద్దాం. ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరుపుకుందాం’’ అంటూ మనోజ్ ట్వీట్ చేశారు. అయితే మనోజ్ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే మోహన్ బాబు ఈ విధంగా ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు మంచు కుటుంబంలో గొడవలు ఎప్పుడు సర్దుమణుగుతాయని అంతా అనుకుంటున్న పరిస్థితి.


ఇవి కూడా చదవండి..

జగన్‌ మాటలు.. బాబు చేతలు!

ఎన్టీఆర్ ఎన్నో‌ సంస్కరణలు తీసుకొచ్చారు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 18 , 2025 | 02:24 PM