Hyderabad Pubs: డబ్బుల కోసం మరీ ఇంతలానా.. పబ్‌లో చిన్నారి డ్యాన్స్
ABN , Publish Date - Jan 23 , 2025 | 01:53 PM
Hyderabad Pubs: కాసుల కోసం ఎంతకైనా తెగిస్తున్నాయి పబ్ యాజమాన్యాలు. హైదరాబాద్‌లోని ఓ పబ్ చేసిన నిర్వాకం దుమారం రేపుతోంది. ఏకంగా మైనర్లను పబ్‌లోకి అనుమతిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ చిన్నారని పబ్‌లోకి అనుమతించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్, జనవరి 23: వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది పబ్‌లపై వాలిపోతుంటారు. అక్కడ డ్యాన్సు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే పబ్‌లకు (Hyderabad Pubs) వెళ్లే వారి విషయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. మైనర్లను, చిన్నారులను పబ్‌లకు అనుమతించడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఈ నిబంధనలు తుంగలో తొక్కింది ఓ పబ్. ఏకంగా చిన్నారిని పబ్‌లోకి అనుమతించడమే కాకుండా.. చిన్నారితో డ్యాన్సులు కూడా వేయించారు పబ్ నిర్వాహకులు. ప్రస్తుతం చిన్నారి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు కావడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈవీడియోను చూసి నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ చిన్నారిని అనుమతించిన పబ్ ఏది.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం..
కాసుల కోసం ఎంతకైనా తెగిస్తున్నాయి పబ్ యాజమాన్యాలు. హైదరాబాద్‌లోని ఓ పబ్ చేసిన నిర్వాకం దుమారం రేపుతోంది. ఏకంగా మైనర్లను పబ్‌లోకి అనుమతిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ చిన్నారని పబ్‌లోకి అనుమతించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పబ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని పబ్‌ల్లో యదేచ్చగా చిన్న పిల్లలను కూడా అనుమతిస్తున్న పరిస్థితి కనబడుతోంది. గత కొద్దిరోజులుగా పబ్‌లపై నిఘా లేకపోవడంతో చిన్న పిల్లలను కూడా పబ్‌లోకి అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది.
Danam Nagender: స్వరం మార్చిన ఎమ్మెల్యే.. ప్రభుత్వంపై ఫైర్.. అధికారులపై ఆగ్రహం..
మియాపూర్ మదీనాగూడలోని ఓ పబ్‌లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా పబ్‌లోకి చిన్నారిని అనుమతించారు పబ్ నిర్వాహకులు. గతంలో ఇదే విధంగా పబ్‌ల్లోకి మైనర్లను అనుమతించారని మైనర్లకు సంబంధించి వీడియోలు వైరల్ కావడంతో వారిపై కేసులు నమోదు చేశారు. కానీ గత కొద్దిరోజులుగా ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల నిఘా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. పబ్‌లో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాయి. ప్రస్తుతం చిన్నారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
సైఫ్ అలీఖాన్ కేసులో నిజాన్ని దాచిపెడుతున్నారా..!
Read Latest Telangana News And Telugu News