Share News

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలి

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:02 AM

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హమీలను నిలబెట్టుకుని కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు డిమాండ్‌ చేశారు. బుధవారం మున్సిపల్‌ కార్మికులతో కలిసి కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలి

సుల్తానాబాద్‌/కాల్వశ్రీరాంపూర్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హమీలను నిలబెట్టుకుని కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు డిమాండ్‌ చేశారు. బుధవారం మున్సిపల్‌ కార్మికులతో కలిసి కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతు తాము అధికారంలోకి వస్తే మున్సి పల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని, వేతనం ఇరవై ఆరు వేలకు పెంచుతామని ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకు జరగలేదన్నారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ కార్మికులకు మూడు సంవత్సరాల నుంచి సబ్బులు, బట్టలు, చెప్పులు, నూనెలు ఇతర వస్తువులు ఇవ్వడం లేదన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించకపోవడంతో కార్మికులు వైద్య సౌకర్యాలకు నోచుకోవడం లేదన్నారు.

పీఎఫ్‌ నుంచి లోన్‌ తీసుకునే వెసలుబాటు కోల్పో యారన్నారు. సమస్యలు పరిష్కరించాలని గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేయను న్నట్లు ప్రకటించారు. నాయకులు న్యాతరి రమేష్‌, మల్లేష్‌, సురేష్‌, లక్ష్మణ్‌,రాంమూర్తి, లక్ష్మీ, శ్రీనివాస్‌,మధు, నరసింగం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మంద రాజేందర్‌, సీఐటీయు మండల నాయకులు అంబాల లక్ష్మణ్‌, చల్ల రాజయ్య, పాల అంజయ్య, మహేష్‌, కొమురయ్య, మధునయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2025 | 12:02 AM

News Hub