రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:45 PM
రౌడీ షీటర్లు సత్ప్రర్తనతో మెలగాలని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ అన్నారు. సర్కిల్ పరిధిలోని సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, పొత్కపల్లి, జూలపల్లి పోలీస్‌స్టేషన్లలో రౌడీ షీటర్లుగా నమోదైన వారితో సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు.

సుల్తానాబాద్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రౌడీ షీటర్లు సత్ప్రర్తనతో మెలగాలని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ అన్నారు. సర్కిల్ పరిధిలోని సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, పొత్కపల్లి, జూలపల్లి పోలీస్‌స్టేషన్లలో రౌడీ షీటర్లుగా నమోదైన వారితో సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతు క్షణికావేశంలో వివిధ సందర్భాలలో కేసులలో ఇరుక్కున్న వారు సమాజంలో సత్ప్రవర్తనతో మెదలాలని సూచించారు. పదే పదే కేసుల పాలవుతూ రౌడీ షీటర్లుగా నమోదు అయి జీవితాలను అంధకారం చేసుకోవద్దన్నారు. సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐలు శ్రావణ్ కుమార్, వెంకటేశ్, రమేష్, సన్నత్ కుమార్ పోలీసులు పాల్గొన్నారు.