రూ. 18 వేల వేతనం చెల్లించాలి
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:37 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విదంగా 18 వేల రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఉదయం 6 గంటల వరకే పెద్ద ఎత్తున ఆశా కార్యకర్తలు కలెక్టరేట్‌కు చేరుకొని ఆందోళన చేపట్టారు.

సుభాష్‌నగర్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విదంగా 18 వేల రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఉదయం 6 గంటల వరకే పెద్ద ఎత్తున ఆశా కార్యకర్తలు కలెక్టరేట్‌కు చేరుకొని ఆందోళన చేపట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి, కార్యదర్శి ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ 19 సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలకు నేతలు హామీలు ఇస్తూ ఎన్నికల్లో గెలిచిన అనంతరం మర్చిపోతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల మెనిఫెస్టోలో ఆశ కార్యకర్తలకు 18వేల ఫిక్స్‌డ్ వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారన్నారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఆశా కార్యకర్తలకు18వేల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రంగవేని శారద, ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత, వెంకటలక్ష్మి, సత్యలక్ష్మి, స్వప్న, విజయలక్ష్మి, రజిత, రజియాబేగం, సరోజన, పద్మ, లక్ష్మి, శంకరమ్మ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.