Share News

త్వరలో సఖీ కేంద్ర భవనాన్ని ప్రారంభించాలి

ABN , Publish Date - Mar 08 , 2025 | 12:16 AM

పెద్దపల్లిలో నిర్మించిన సఖి కేంద్రం భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ పట్టణం లో విస్తృతంగా పర్యటించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సఖీ కేంద్ర భవన నిర్మాణం పూర్తయిందని, ప్రజాప్రతినిధుల సమయం తీసుకుని త్వర లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

త్వరలో సఖీ కేంద్ర భవనాన్ని ప్రారంభించాలి

పెద్దపల్లిటౌన్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లిలో నిర్మించిన సఖి కేంద్రం భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ పట్టణం లో విస్తృతంగా పర్యటించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సఖీ కేంద్ర భవన నిర్మాణం పూర్తయిందని, ప్రజాప్రతినిధుల సమయం తీసుకుని త్వర లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఆహార నాణ్యతను పరిశీలించారు. మానసిక దివ్యాంగుల కేంద్రంలో వసతులు కల్పించాలని, ప్రభుత్వం అందించే సహాయ కార్య క్రమాలపై నివేదిక అందజేయాలని కలెక్టర్‌ తెలిపారు. పాత ఆసుపత్రి భవనాన్ని కూల్చివేసేందుకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలన్నారు. పాత ఆసుపత్రిలోని రోగులను మాత శిశు ఆసుపత్రులకు తరలించా మని, పాత ఆసుపత్రి స్థానంలో నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని కలెక్టర్‌ తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను కలెక్టర్‌ పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలు సిస్టంలో నమోదు చేయాలని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జి రవీం దర్‌ రెడ్డి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేష్‌ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 12:16 AM

News Hub