Share News

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:22 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు.

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

-ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ఎండపల్లి, మార్చి23 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించి, ఎస్సీ వర్గీకరణను చట్ట సభలలో ఆమోదించిన సందర్భంగా ఆదివారం ఎండపల్లి మండలం లోని రాజారాంపల్లి గ్రామంలో కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ హాజరయ్యారు. ఆయనకు ధర్మారం మండలం నుంచి బైక్‌ ర్యాలీ ద్వారా ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ హయాంలో కాని పనులు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అవుతున్నం దుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యేలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలు పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బొందపెట్టి కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం కల్పించారన్నారు. ఈ రోజు తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చిందంటే మీ అందరి ఆశీర్వదంతోనేనని, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటానని విప్‌ అడ్లూరి పేర్కొన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చిన కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. ఇంతకుముందు నియోజక వర్గ ప్రజలు ఎమ్మెల్యేతో ఏ పని ఉన్నా కరీంనగర్‌ వెళ్లి కలవాల్సి వచ్చేదన్నారు. కాని తాను గెలిచిన 14నెలల నుంచి క్యాంపు కార్యాలయంలోనే అందుబాటులో ఉంటు న్నానని విప్‌ తెలిపారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా పార్టీలతో సంబంధం లేకుండా పని చేస్తానని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులతో ఎన్నో ఇబ్బందులు పెట్టినా తట్టుకొని నిలబడ్డా రని గుర్తు చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి నృత్యాలు వేశారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మద్దుల గోపాల్‌రెడ్డి, మండల అధ్యక్షులు తాటిపర్తి శైలెందర్‌రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 12:22 AM