నీటి ఎద్దడి తీర్చాలని మహిళల ఆందోళన
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:19 AM
తాగునీటి సమస్య తీర్చాలని రాయికల్ మండలం మూటపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ మహిళలు ఆదివారం నీటి ట్యాంక్ ముందు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు.

రాయికల్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : తాగునీటి సమస్య తీర్చాలని రాయికల్ మండలం మూటపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ మహిళలు ఆదివారం నీటి ట్యాంక్ ముందు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 రోజుల నుంచి తాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాలనీలో ఉన్న బోర్ కాలిపోయి 25 రోజులు అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా తాగునీటి సమస్య తీర్చాలని కాలనీ మహిళలు వేడుకుంటున్నారు.