Share News

Mahesh Kumar: ఇందిరమ్మ ముందు మోదీ ఎంత?

ABN , Publish Date - Jan 26 , 2025 | 04:08 AM

ఇందిరమ్మ త్యాగం ముందు బీజేపీ త్యాగం ఎంత.. మోదీ పర్సనాలిటీ ఎంత?’ అంటూ టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ నిలదీశారు. కేంద్ర పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే నిధులివ్వబోమంటూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఏ హక్కుతో అన్నారని ప్రశ్నించారు.

Mahesh Kumar: ఇందిరమ్మ ముందు మోదీ ఎంత?

  • ఇళ్ల పథకానికి ఆమె పేరు పెడితే నిధులివ్వరా?

  • బండి సంజయ్‌పై టీపీసీసీ చీఫ్‌ ఆగ్రహం

హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘బలహీన వర్గాల ఇళ్ల పథకానికి ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టొ ద్దు? ప్రపంచంలోనే ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరమ్మ పేరు పెడి తే బండి సంజయ్‌కు వచ్చిన కడుపు నొప్పి ఏంటి? ఇందిరమ్మ త్యాగం ముందు బీజేపీ త్యాగం ఎంత.. మోదీ పర్సనాలిటీ ఎంత?’ అంటూ టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ నిలదీశారు. కేంద్ర పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే నిధులివ్వబోమంటూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఏ హక్కుతో అన్నారని ప్రశ్నించారు. ఇది ఒక రకంగా ప్రజల ఆకాంక్షలను అవమానించినట్లేనని, ఇందుకు సంజయ్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం బలైన ఇందిరమ్మ కుటుంబాన్ని కించపరిచేలా ఎవరు మాట్లాడినా దేశ ప్రజ లు క్షమించబోరన్నారు.


వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ నాలుగు ముక్కలు కాబోతుందని, ఆ పార్టీలో తండ్రి, కొడుకు తప్ప ఎవరూ ఉండబోరని జోస్యం చెప్పారు. కక్ష సాధింపు రాజకీయాలన్నది కాంగ్రెస్‌ సిద్ధాంతం కానే కాదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. గతంలోని కాంగ్రెస్‌ సీఎంల నుంచి ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి వరకూ ఎవరూ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదన్నారు. ప్రతి పేదకూ సంక్షేమం అందాలన్న సంకల్పంతో నాలుగు పథకాలు ప్రారంభిస్తున్నామని, ప్రతి గ్రామంలోనూ దీన్ని పండుగగా జరపాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


ఇవీ చదవండి:

క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్

రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 04:08 AM