Heatwave: భానుడి భగభగలు
ABN , Publish Date - Mar 06 , 2025 | 06:15 AM
హనుమకొండ జిల్లా పెద్ద పెండ్యాల, వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగళవారి పేట, జనగామ జిల్లా బచ్చన్నపేట, ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని దగడపల్లిలలో 39.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది.

మహబూబాబాద్ జిల్లా గార్లలో 39.3 డిగ్రీలు
వనపర్తిలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో 39.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హనుమకొండ జిల్లా పెద్ద పెండ్యాల, వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగళవారి పేట, జనగామ జిల్లా బచ్చన్నపేట, ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని దగడపల్లిలలో 39.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు మండిపోతుండడంతో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్‌లో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట, అక్కన్నపేట మండలంలోని కట్కూర్‌లలో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ హాకీంపేటలో గరిష్ఠంగా 38.7 డిగ్రీలు, బేగంపేటలో 37.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.