Gaddar Awards: గద్దర్ అవార్డులకు రూ.10 కోట్లు!
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:07 AM
రాష్ట్ర ప్రభుత్వం సినీ రంగంలో ఇవ్వదలచిన ‘గద్దర్ అవార్డు’ల కోసం 2025-26 బడ్జెట్‌లో రూ.10 కోట్లు ప్రతిపాదించింది.

2025-26 బడ్జెట్‌లో ప్రతిపాదన
హైదరాబాద్, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సినీ రంగంలో ఇవ్వదలచిన ‘గద్దర్ అవార్డు’ల కోసం 2025-26 బడ్జెట్‌లో రూ.10 కోట్లు ప్రతిపాదించింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ కోసం అన్ని శాఖలతో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సమాచార శాఖ, ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పోరేషన్‌లకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులపై సమీక్షించారు. ఈ క్రమంలో ఫిల్మ్ డెవల్‌పమెంట్‌కు కేటాయించే మొత్తం నిధుల్లో నుంచి గద్దర్ అవార్డుల కోసం రూ.10 కోట్లను ప్రతిపాదించినట్టు విశ్వసనీయ సమాచారం.