Share News

Raj Tharun Controversy : ‘రాజ్‌తరుణ్‌- లావణ్య’ కేసులో మలుపు!

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:56 AM

సినీ నటుడు రాజ్‌తరుణ్‌- లావణ్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో కీలకంగా మారిన రవి బవాజీ మస్తాన్‌ సాయి అలియాస్‌ మస్తాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనతో సహజీవనం చేసి, పెళ్లి చేసుకొని, ముఖం చాటేశాడంటూ గత ఏడాది జూలై 4న రాజ్‌తరుణ్‌పై లావణ్య నార్సింగ్‌ పోలీస్‌

Raj Tharun Controversy : ‘రాజ్‌తరుణ్‌- లావణ్య’ కేసులో మలుపు!
Lavanya and Mastan Sai Case

మహిళలకు డ్రగ్స్‌ అలవాటు చేసి నగ్న వీడియోలు

తీసిన మస్తాన్‌ సాయి వందల మంది అమ్మాయిల వీడియోలు తీసి, బ్లాక్‌మెయిల్‌ చేశాడు

పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య.. హార్డ్‌డిస్క్‌ అందజేత

హార్డ్‌డిస్క్‌ కోసం లావణ్యపై దాడికి యత్నం.. డయల్‌-100కు ఫోన్‌

ఆమె ఇంటికెళ్లి మస్తాన్‌సాయిని అరెస్టు చేసిన పోలీసులు

అతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నాలుగు కేసులు

హైదరాబాద్‌ సిటీ/నార్సింగ్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు రాజ్‌తరుణ్‌- లావణ్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో కీలకంగా మారిన రవి బవాజీ మస్తాన్‌ సాయి అలియాస్‌ మస్తాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనతో సహజీవనం చేసి, పెళ్లి చేసుకొని, ముఖం చాటేశాడంటూ గత ఏడాది జూలై 4న రాజ్‌తరుణ్‌పై లావణ్య నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇదే కేసులో తమకు పరిచయస్తుడైన మస్తాన్‌ సాయి.. చాలా మంది మహిళల ప్రైవేట్‌ వీడియోలు తీశాడని లావణ్య ఆరోపించింది. అలాగే తన వీడియోలు కూడా తీసి రాజ్‌తరుణ్‌కు చూపించి, అతని నుంచి తనను దూరం చేశాడని తెలిపింది. మస్తాన్‌ తనపై అత్యాచారం చేసేందుకూ ప్రయత్నించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. డ్రగ్స్‌ సరఫరాదారుడిగా మారిన మస్తాన్‌.. ఎంతోమంది మహిళలకు మాదకద్రవ్యాలు అలవాటు చేశాడని తెలిపింది. వారు మత్తులో ఉన్నప్పుడు నగ్న వీడియోలు చిత్రీకరించినట్లు తాను గుర్తించానని ఫిర్యాదులో వివరించింది. అందుకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌ తన చేతికి చిక్కిందని లావణ్య ఫిర్యాదు చేసినట్లు నార్సింగ్‌ పోలీసులు వెల్లడించారు. తన వీడియోలను డిలీట్‌ చేయాలని చూడగా.. అందులో వందలాది మహిళల నగ్న వీడియోలు ఉన్నాయని, వాటిని అడ్డం పెట్టుకొని మస్తాన్‌.. వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాడని లావణ్య తెలిపింది. బాధిత మహిళల్లో పెళ్లయినవారు, పెళ్లికాని అమ్మాయిలు ఉన్నారని.. ఎక్కడ తమ జీవితాలు ఇబ్బందుల్లో పడతాయోనని వారు బయటకు రావట్లేదని ఫిర్యాదులో పేర్కొంది.

ఇంటికి వచ్చి దాడి చేయడంతో..

నగ్న వీడియోల హార్డ్‌ డిస్క్‌ తన దగ్గర ఉదని తెలుసుకున్న మస్తాన్‌.. పలుమార్లు ఇంటికి వచ్చి చంపేస్తానని బెదిరించాడని లావణ్య ఆరోపించింది. జనవరి 31న మరోసారి ఇంటికొచ్చి టీవీ, సీసీటీవీలు, ఇతర వస్తువులను ద్వంసం చేసినట్లు తెలిపింది. సోమవారం మరో స్నేహితుడితో కలిసి వచ్చి తనపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో డయల్‌-100కు ఫోన్‌ చేసింది. దీంతో కోకాపేటలోని లావణ్య ఇంటికి చేరుకున్న పోలీసులు అక్కడ డ్రగ్స్‌ మత్తులో ఉన్న మస్తాన్‌తో పాటు అతని స్నేహితుడు షేక్‌ ఖాజా మొహియుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ల్యాప్‌టాప్‌, ఫోన్‌, హార్డ్‌డిస్క్‌ స్వాధీనం చేసుకున్నారు. నగ్న వీడియోలు తీసి, తనతో పాటు వందలాది మంది మహిళల జీవితాలతో ఆడుకుంటున్న మస్తాన్‌పై చర్యలు తీసుకోవాలని లావణ్య చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై బీఎన్‌ఎ్‌స సెక్షన్‌ 329(4), 324(4), 109, 77, 78ల కింద కేసు నమోదు చేశారు. మస్తాన్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు ఖాజాకు నోటీసులు జారీ చేశారు.


మస్తాన్‌ హార్డ్‌ డిస్క్‌లో నిఖిల్‌ వీడియోలు

మస్తాన్‌ వద్ద ఉన్న మరో హార్డ్‌ డిస్క్‌లో వందలాది మహిళల నగ్న వీడియోలతో పాటు సినీ నటుడు నిఖిల్‌, గతంలో డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఒక ప్రముఖ టిఫిన్‌ సెంటర్‌ యజమాని ప్రభాకర్‌రెడ్డి ఫోన్లను హ్యాక్‌చేసి వారి ప్రైవేట్‌ వీడియోలను సైతం స్టోర్‌ చేసినట్లు సమాచారం.

మస్తాన్‌పై పలు క్రిమినల్‌ కేసులు..

మస్తాన్‌పై ఇప్పటికే నాలుగు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఇందులో గుంటూరు జిల్లాలోని పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో, సైబరాబాద్‌ పరిధిలోని మోకిల స్టేషన్‌లో, నార్సింగ్‌ స్టేషన్‌లో; విజయవాడ వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో మరో కేసు నమోదయ్యాయి.

నాలాగా మరికొందరి జీవితాలు బలి కాకూడదు: లావణ్య

ఈ హార్డ్‌డి్‌స్కను పోలీసులకు ఇచ్చినా సరే నాకు ప్రాణహాని తప్పదు. కానీ, నాలాగా ఇతర మహిళల జీవితాలు ఇలాంటి వెధవలు తీసే వీడియోల వల్ల బలికాకూడదు. నాకు న్యాయం జరిగినా, జరగకపోయినా కనీసం ఈ ఫిర్యాదు చూసైనా మహిళలు జాగ్రత్త పడతారు. పోలీసుల పట్ల పూర్తి విశ్వాసంతో అన్ని ఆధారాలున్న హార్డ్‌ డిస్క్‌ను అందిస్తున్నా. అదేవిధంగా మస్తాన్‌ దగ్గరున్న మరో రెండు హార్డ్‌ డిస్క్‌లను, అన్ని ఎలకా్ట్రనిక్‌ పరికరాలను పోలీసులు తీసుకొని, మహిళల డేటాను డిలీట్‌ చేయాలని కోరుతున్నా.


ఇవి కూడా చదవండి..

KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..


Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు

Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 08:00 AM