Araku Chali Utsav: అదరగొట్టేలా అరకు చలి ఉత్సవాలు..కల్చరల్ ర్యాలీ
ABN , Publish Date - Jan 31 , 2025 | 10:16 PM
అల్లూరి జిల్లా అరకులో చలి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా మ్యూజియం నుంచి ప్రధాన వేదిక వరకు కల్చరల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌తో సహా ఉన్నతాధికారులు అంతా సంప్రదాయ నత్యాలతో పాటు ప్లాస్ డార్క్ డ్యాన్స్ చేస్తూ ఫెస్టివల్ శోభ తీసుకువచ్చారు.

అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లా అరకులో చలి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా మ్యూజియం నుంచి ప్రధాన వేదిక వరకు కల్చరల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌తో సహా ఉన్నతాధికారులు అంతా సంప్రదాయ నత్యాలతో పాటు ప్లాస్ డార్క్ డ్యాన్స్ చేస్తూ ఫెస్టివల్ శోభ తీసుకువచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 వరకు అరకు ఉత్సవ్ నిర్వహించేవారు. ఆ తర్వాత వైసీపీ సర్కారు ఒక్కసారే ఉత్సవాలు జరిపి సరి పెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం.. ఈ నెల 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో అరకు ఉత్సవ్‌ను నిర్వహించాలని ఆదేశిస్తూ, కోటి రూపాయలు మంజూరు చేసింది. దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేశ్‌కుమార్ ఆధ్వర్యంలో భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈసారి ‘హెలికాప్టర్ రైడ్’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
