CM Chandrababu: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఎమోషనల్.. ఎందుకంటే
ABN, Publish Date - Mar 20 , 2025 | 05:15 PM
ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తన తల్లిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నారావారిపల్లె వచ్చి.. తన తల్లి దగ్గర ఎస్సీ వర్గీకరణ కోసం మెమోరాండం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి ఎస్సీవర్గీకరణ కోసం పోరాటం ప్రారంభించారని గుర్తుచేసుకున్నారు.

ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన తల్లిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నారావారిపల్లె వచ్చి.. తన తల్లి దగ్గర ఎస్సీ వర్గీకరణ కోసం మెమోరాండం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారని తెలిపారు. అక్కడి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం ప్రారంభించారని గుర్తుచేసుకున్నారు. తనది రాజకీయాల్లో సుదీర్ఘమైన చరిత్ర అని తెలిపారు. నారావారి పల్లెల్లో పుట్టి అంచెలంచెలుగా ఎదిగానని చెప్పారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చానని గుర్తుచేశారు. మా ఊరుకు సరైన రోడ్డు లేదన్నారు. ఇందుకోసం పోరాటం చేశానని తెలిపారు. అయితే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. ఎస్సీ వర్గీకరణపై చర్చ అనంతరం అసెంబ్లీలో తీర్మానం చేశారు. తీర్మానాన్ని జాతీయ ఎస్సీ కమిషన్‌కు ప్రభుత్వం పంపనుంది.
పూర్తి వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల విచారణకు విష్ణుప్రియ... మొబైల్ సీజ్
అందుకేమరి.. కాస్త చూసుకొని మాట్లాడాలనేది.. ఏం
సంజూ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్
For More Andhra Pradesh News and Telugu News..
Updated at - Mar 20 , 2025 | 05:21 PM