Home » Crop Loan Waiver
రుణమాఫీ పథకం అమలుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ సవాలుగా మారింది. రెండు లక్షల రుణమాఫీ చేయటానికి మొత్తం రూ.31 వేల కోట్ల నిధులు అవసరమవుతుండగా తొలివిడతలో లక్ష వరకు మాఫీ చేయటానికి రూ. 6,100 కోట్లు ఖర్చు చేశారు.
పంట రుణాల మాఫీపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. తొలి విడతలో లక్ష దాకా రుణం మాఫీ అయిన అన్నదాతలు రైతు వేదికల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
బ్యాంకులో పంట రుణం తీసుకున్న ప్రతీ రైతుకూ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రుణ మాఫీకి పట్టాదారు పాసుపుస్తకమే ప్రాతిపదిక అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రతి రైతునూ రుణ విముక్తుడిని చేయాలన్న లక్ష్యంతో రూ.2లక్షల మేర రుణాలను ఒకేసారి మాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
రాష్ట్రంలో రైతు రుణాల మాఫీకి రంగం సిద్ధమైంది. గురువారం సాయంత్రం 4గంటలకు ముహూర్తం ఖరారైంది. తొలి విడతలో రూ.లక్ష లోపు రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయనుంది.
అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. గతంలో చెప్పినట్లుగానే నిర్ణీత వ్యవధిలో తీసుకున్న అప్పు, వడ్డీ మొత్తం కలిపి కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసులను తక్షణమే సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విద్యుత్తు కొనుగోలు అంశంలో జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తును వేగవంతం చేయాలని పేర్కొంది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 33 ఎకరాల వ్యవసాయేతర భూమికి రైతుబంధు సాయం దక్కింది! ఒక సీజన్‌లో కాదు.. ఏకంగా ఐదేళ్లు! దీనిపై ఫిర్యాదు రావడంతో ఆ సొమ్ము రికవరీకి ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
రుణమాఫీ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆదాయపు పన్ను చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘‘ఆరు నూరైనా.. పంద్రాగస్టులోగా రూ.2 లక్షల్లోపు రుణమాఫీ చేసి తీరుతా..!’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శపథం చేసిన మేరకు.. అధికారులు ఆ దిశలో విధివిధానాలపై కసరత్తు ముమ్మరం చేశారు. నేడోరేపో మార్గదర్శకాలను వివరించే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి.