Home » Leopard
తిరుమలలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. అలిపిరి వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న టీటీడీ ఉద్యోగికి చిరుత కనిపించింది. చిరుతను చూడగానే అతను తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.
నంద్యాల జిల్లా: శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి కలకలం రేపింది. పాతాళగంగలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో చిరుత సంచరించింది. చిరుత తిరుగుతున్న దృశ్యాలు సిసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. రాజన్న అనే రైతు పొలంలోని రెండు ఆవు దూడలపై పులి దాడి చేసి చంపేసింది. చిరుత సంచారం వార్త తెలుసుకున్న స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ములుగు జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంబాపురం అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులుగుర్తించారు. పాదముద్రలు సేకరించి ప్రజలను అప్రమత్తం చేశారు.
ఆఫ్రికన్ సాహస యాత్రలో భాగంగా కరోల్, బాబ్ అనే దంపతులు టాంజానియా దేశం సెరెంగేటి నేషనల్ పార్క్‌కు వెళ్లారు. రేంజర్ గాడ్ లివింగ్ షూతో కలిసి వారిద్దరూ ఉదయం వేళ సఫారీ రైడ్ ప్రారంభించారు.
శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. ఆర్టిసీ బస్టాండ్ సమీపంలోని ప్రహరీ గోడపై చిరుత కూర్చొని ఉండాన్ని స్థానికులు, భక్తులు గుర్తించి.. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై స్థానిక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో భక్తులతోపాటు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు.
Andhrapradesh: ఏపీలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ద్వారకా తిరుమలలో గత నాలుగు రోజులుగా చిరుత పులి సంచరిస్తుండటంతో దాన్ని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
చిరుతల అనుమానాస్పద మరణాలపై పకడ్బందీగా విచారణ చేసి నేరస్తులను గుర్తించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అన్ని వన్యప్రాణుల వేట ఘటనలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వన్న్య ప్రాణులను వేటాడటం, వాటి అవయవాలతో వ్యాపారాలు చేసేవారిని ఏ మాత్రం ఉపేక్షించవద్దని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
సాధు జంతువులను ఏం చేసినా.. కవ్వించినా అవి ఏం చేయ్యవు. అదే పులి, సింహం, చిరుత లాంటి జీవులను కవ్విస్తే ఏం చేస్తాయో. అందరికి తెలిసిందే. ఇంకా సోదాహరణగా తెలియాలంటే మాత్రం.. వివరాల్లోకి వెళ్లాల్సిందే.
జిల్లా వాసులను కొన్ని రోజులుగా చిరుతపులి సంచారం హడలెత్తిస్తోంది. రాజమహేంద్రవరం, ద్వారకా తిరుమల ప్రాంతాల మధ్య తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.