Share News

Leopard Kalakalam: శ్రీశైలంలో చిరుతపులి కలకలం..

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:51 PM

నంద్యాల జిల్లా: శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి కలకలం రేపింది. పాతాళగంగలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో చిరుత సంచరించింది. చిరుత తిరుగుతున్న దృశ్యాలు సిసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

Leopard Kalakalam: శ్రీశైలంలో చిరుతపులి కలకలం..
Leopard Kalakalam

నంద్యాల జిల్లా: శ్రీశైలం (Srisailam)లో అర్ధరాత్రి చిరుతపులి కలకలం (Leopard Kalakalam) రేపింది. పాతాళగంగ (Pathal Ganga)లోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో చిరుత సంచరించింది. చిరుత తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరా (CCTV Camera)లో రికార్డు అయ్యాయి. దీంతో భక్తులు (Devotees) తీవ్ర భయాందోళన చెందుతున్నారు. స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరుత పులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కృష్ణా, అనంతరపురం జిల్లాల ప్రజలను చిరుతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గన్నవరం మండలం మెట్లపల్లి శివారులో ఆదివారం ఉదయం పులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. మెట్లపల్లి సమీపంలోని ఆయిల్ పామ్ తోట వద్ద చిరుత సంచరించినట్లు ఆర్టీసీ బస్ కండక్టర్ రవికిరణ్ తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు స్థానికంగా ఉన్న కొండగట్టుపైకి వెళ్తుండగా.. అదే సమయంలో పులి తన పిల్లలతో రోడ్డు దాటుతుండడాన్ని కండక్టర్ గుర్తించాడు.


చిరుత కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన రవికిరణ్ విషయాన్ని వెంటనే ఆగిరిపల్లి పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. కండక్టర్ నుంచి పూర్తి వివరాలు సేకరించి చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టారు. మరోవైపు పెద్దపులి సంచరిస్తుందన్న వార్త మెట్లపల్లి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలను హడలెత్తిస్తోంది. పొలం పనులు, పక్క గ్రామాలకు వెళ్లాలన్నా సరే వణికిపోతున్నారు. ఎటువైపు నుంచి వచ్చి మీద పడుతుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు త్వరగా దాన్ని పట్టుకోవాలని కోరుతున్నారు.

మరోవైపు అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. రాజన్న అనే రైతు పొలంలోని రెండు ఆవు దూడలపై పులి దాడి చేసి చంపేసింది. చిరుత సంచారం వార్త తెలుసుకున్న స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినా వారు పట్టించుకోలేదంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. చిరుతల సంచారంపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొలం పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత దాడి చేయకముందే దాన్ని పట్టుకుని తమ ప్రాణాలు రక్షించాలంటూ అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హీరో విశాల్‌కు ఏమైంది..

ఏసీబీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లిపోయిన కేటీఆర్..

ఫార్ములా-ఈ కారు రేసు కేసు.. ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్..

పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్

బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 06 , 2025 | 12:51 PM