Home » YSRCP
పేదల ఆక్రమణలో ఉన్న 150 గజాల వరకు ఇంటి స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకుమించితే... నిర్ణీత ధర వసూలు చేయాలని తీర్మానించింది
MP Mithun Reddy: వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం నాడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారని వార్తలు రావడంతో ఆయన వెంటనే హైకోర్టుకు వెళ్లి తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు.
పార్టీ పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్ని కష్టనష్టాల్లో తోడుగా ఉన్న కార్యకర్తలకు అండగా ఉండాలని అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భావించారు. ఇందు కోసం గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
వైఎస్సార్సీపీ సభ్యులపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు సభకు దొంగల్లా వచ్చి.. సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు గౌరవంగా సభకు రావాలని.. సమస్యలపై మాట్లాడాలని సభాపతి వారికి సూచించారు.
మాజీ సీఎం జగన్‌కు సన్నిహితుడిగా పేరుపొందిన మరో నాయకుడు వైసీపీకి దూరం కానున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిందని శాసన మండలి సభ్యుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. బుధవారం శాసనమండలిలో దవ్యవినిమయ బిల్లుపై ఆయన మాట్లాడారు.
Handriniva Canal Debate: హంద్రీనీవా కాలువకు సంబంధించి వైసీపీ ఆరోపణలపై మంత్రి నిమ్మల రామానాయుడు ధీటైన సమాధానం ఇచ్చారు. హంద్రీనీవా ద్వారా రెట్టింపు జలాలు ప్రవహించేలా సీఎం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Legislative Council Controversy: ఫొటో సెషన్‌కు వెళ్తే తనకు కుర్చీ కేటాయించలేదని... తనతో పాటు మండలి ఛైర్మన్‌ను కూడా చిన్నచూపు చూశారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Marri Rajasekhar Resigns: వైసీపీకి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్‌కు అందజేశారు. అయితే రాజశేఖర్‌ను బుజ్జగించేందుకు వైసీపీ సభ్యులు ప్రయత్నించినప్పటికీ అవి ఫలించలేదని చెప్పుకోవాలి.
ఏపీ శాసనమండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఏపీని తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. సభలో వైసీపీ సభ్యుల పద్ధతి సరిగా లేదని లోకేష్ చెప్పారు.