Home » YSRCP
2008 నుంచి ఇప్పటివరకూ అన్నీ ప్రభుత్వ ఉత్తర్వులూ జీవోఐఆర్ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 మధ్య విడుదల చేసిన ఉత్తర్వులు మాత్రం సైట్లో అప్లోడ్ చేయలేదు.
జిల్లాకు ఎంతో అవసరమైన దగదర్తి విమానాశ్రయ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, విమానాశ్రయ ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు.
జగన్ సంపదంతా తండ్రి, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజా సంపదను దోచుకున్నదే కాని సక్రమ సంపాదన కాదన్నారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డి జగన్ ముఠాలో తోడుదొంగలు కాదా ..
షర్మిల రాజకీయంగా దిగజారిపోయారని..ఆమె ఎవరి పతనం కోరుకుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. వైసీపీ ప్రత్యర్థుల మోచేయి నీళ్లను షర్మిల తాగుతున్నారని ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డిపై కనీసం గౌరవం లేకుండా షర్మిల మాట్లాడుతున్నారని అమర్నాథ్ ఫైర్ అయ్యారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం నుంచి ఏపీని గాడిలో పెడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రూ.10లక్షల కోట్లకు పైగా ఏపీపై అప్పు భారం ఉందని.. దానిని కూటమి ప్రభుత్వం మోస్తుందనే విషయం గ్రహించాలని అన్నారు. ఏపీ ఓ విషవలయంలో ఉందనే గుర్తించాలని అన్నారు.
సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. తల్లికి, కుమారుడికి మధ్య ఆస్తుల ఎంఓయూ ఉంటుందని దేశంలో తొలిసారిగా తెలిసిందని చెప్పారు.
Andhrapradesh: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిపై వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని.. జగన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. షర్మిల ఎవరి స్క్రిప్ట్ చదువుతుందో తమకు తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు.
వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రకాశం బ్యారేజీకి వైసీపీ హయాంలో తీరని నష్టం వాటిల్లింది. జగన్ హయాంలో బ్యారేజీ నిర్వహణను కనీసం పట్టించుకోలేదు. ప్రకాశం బ్యారేజీ వద్ద రోజురోజుకు కోత పెరుగుతోంది.
జగన్ ప్రభుత్వంలో భూ కబ్జాలు , విధ్వంసాలు, గంజాయి మత్తు పదార్థాలు బాగా పెరిగిపోయాయని.. కూటమి ప్రభుత్వం అన్నింటికీ అడ్డు కట్ట వేసిందని మంత్రి బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. తొలిసారిగా విశాఖపట్నంలో జిల్లా సమీక్ష సమావేశం ఇవాళ(శుక్రవారం) నిర్వహించామని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్ల పర్యటించారు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన పర్యటన అసహనం, గందరగోళం మధ్య సాగింది. ముందుగా ఎస్ఎస్ఆర్పేట నుంచి బయలుదేరిన వెఎస్ జగన్.. గుర్ల గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ ఒకవైపు బాధితులు, మరోవైపు ప్రజలు, ఇంకోవైపు నాయకుల హడావిడి ఎక్కువకావడంతో ఒక్కసారిగా..