Home » Telangana » Nalgonda
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో హమాలీలు, ఖరీదుదారుల నడుమ బస్తాల గొడవ కొలిక్కిరాలేదు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి 31 వరకు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సనప్రీతసింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చింతలపాలెం మండలకేంద్రంలో బుధవారం మరో ఆరు అతిసార వ్యాధి లక్షణాలు కలిగిన కేసులు నమోదయ్యాయి.
హుజూర్నగర్ పట్టణంలోని ఎన్‌ఎ్‌సపీ క్యాంప్‌లో ఈ నెల 27న మహారుద్రాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఎనిమిది అడుగుల మృత్తిక(మట్టి) శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయనున్నారు.
హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని రహదారులకు మహర్దశ కలుగనుంది.
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలో మద్యనిషేధానికి మరో గ్రామం ముందడుగు వేసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయి న మూసీ కాల్వలకు నిధులు మంజూరు చేసి భువనగిరి నియోజకవర్గానికి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి మంగళవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కోరారు.
:ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం భువనగిరి లో నిరసన ర్యాలీ నిర్వహించారు.
డీఎస్సీ 2024లో ఉద్యోగాలు సాధించిన నూతన ఉపాధ్యాయు లు నేడు విధుల్లో చేరనున్నారు. మంగళవారం భువనగిరిలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో నూతన ఉపాధ్యాయులకు జిల్లా విద్యా శాఖ అధికారులు పోస్టింగ్‌లు కేటాయించారు. ఖాళీ పోస్టుల జాబితా ఆధారంగా నూతన ఉపాధ్యాయులు ఆప్షన్ మేరకు పాఠశాలలను కేటాయించారు. ఈమేరకు కేటాయింపు పత్రాలను డీఈవో కె.సత్యనారాయణ అందజేసి అభినందించారు.
వా నాకాలం 2024-25కు సంబంధించి సన్న, దొడ్డురకం వరి ధాన్యం కొనుగోలును సక్రమంగా నిర్వహించాలని కలెక్ట ర్ హనుమంతు కే.జెండగే సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి ధాన్యం కొనుగోలుపై మంగళవా రం అవగాహన సమావేశం నిర్వహించారు.