హైదరాబాద్: బీజేపీ ఆఫీస్ బేరర్స్ భేటీ
ABN , First Publish Date - 2021-08-29T15:22:51+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు ఆదివారం కాసేపట్లో ప్రారంభం కానుంది.
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు ఆదివారం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి కళాశాలలో బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి ముఖ్యనేతలు, డీకే అరుణ, గరికపాటి, బాబుమోహన్, రాజాసింగ్, స్వామిగౌడ్, పొంగులేటి, వివిధ మోర్చాల అధ్యక్షులు, పాదయాత్ర ఇంఛార్జ్‌లు తదితరులు హాజరయ్యారు. సంగ్రామ యాత్రను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అనంతరం మెహిదీపట్నం, టోలీచౌకీ, షేక్ పేట్, గోల్కొండ కోట, లంగర్ హౌస్ మీదుగా పాదయాత్ర జరగనుంది. సాయంత్రం 4గంటలకు గోల్కొండ కోట వద్ద ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ ప్రసంగించనున్నారు. ఈ రాత్రికి బాపుఘాట్‌లో బండి సంజయ్ బస చేయనున్నారు.