అడ్డగోలుగా రోడ్ల తవ్వకాలు
ABN , First Publish Date - 2020-10-01T11:04:45+05:30 IST
అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుకు సీసీరోడ్లు, తారు రోడ్లను సైతం ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు

ఇష్టారీతిన అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు
పునర్నిర్మాణ మరమ్మతులలో నిర్లక్ష్యం
అద్దంకి, సెప్టెంబరు 30: అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుకు సీసీరోడ్లు, తారు రోడ్లను సైతం ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. పని పూర్తయిన తరువాత తవ్విన చోట పునర్నిర్మాణ పనులు చేయటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఓ ప్రయివేట్ సెల్ కంపెనీ ఇంటర్నెట్ను మరింత విస్తృత పరి చేందుకు, ఆ కంపెనీకి చెందిన సెల్ టవ ర్లను అనుసంధానం చేస్తూ అండర్ గ్రౌండ్ కేబుల్ (ఆప్టికల్ ఫైబర్ కేబుల్) లైన్ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే ఆయా పట్టణాలను అనుసంధానం చేస్తూ రోడ్ల వెంబడి మార్జిన్లలో అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుచేశారు. ప్ర స్తుతం మెయిన్ లైన్లను సెల్ టవర్లకు అను సంధానం చేసేందుకు వీలుగా అండర్ గ్రౌండ్ కేబు ల్ ఏర్పాటుకు తవ్వుతున్నారు. గతంలో నామ్ రోడ్డు వెంబడి ఓఎఫ్సీ కేబుల్ ఏర్పాటుకు పలుచోట్ల గోతు లు తవ్వి కేబుల్ వైర్లు ఏర్పాటుచేశారు. అయితే పను లు పూర్తయిన తరువాత గోతులను పూడ్చటంలో తీవ్ర నిర్లక్ష్యం వహించటంతో పలు చోట్ల గోతులు ఏ ర్పడ్డాయి. మరి కొన్ని చోట్ల ఎత్తుపల్లాలుగా మారా యి.
దీంతో సర్వీసు రోడ్డులో ప్రయాణించే వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నా రు. ప్రస్తుతం నామ్ రోడ్డులో పాత బ స్టాండ్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా పోలీస్ స్టేషన్ రోడ్డు వరకు కేబుల్ లైన్ ఏర్పాటుకు మిషన్ ద్వా రా డ్రిల్లింగ్ చేస్తున్నారు. పలు చోట్ల సీసీ రోడ్లను త వ్వి గుంతలు ఏర్పాటు చేసి మిషన్ ద్వారా కేబుల్ పంపుతున్నారు. ప్రస్తుతం సీసీ రోడ్లు తవ్విన చోట పనులు పూర్తయిన తరువాత పునర్నిర్మాణ పనులు చేయించటం పై నగర పంచాయతీ అధికారులలు ప్రత్యేక దృష్టి పెట్టాలని వ్యాపారులు, స్థానికులు కోరుతున్నారు.
రోడ్డును యథావిధిగా నిర్మించాలి
ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటుకు మిషన్ ద్వారా గోతులు తవ్విన చోట పనులు పూర్తయి న తరువాత యఽథావిధిగా పునర్నిర్మాణం చే యాల్సి ఉంది. సీసీరోడ్లు తవ్వితే మళ్లీ సీసీ రోడ్డుగా మరమ్మతులు చేయిస్తాం.
- శ్రీరామమూర్తి, ఏఈ, అద్దంకి