కుందూనదిలోకి క్వారంటైన్ వ్యర్థజలాలు.. ఆందోళనలో నంద్యాల వాసులు
ABN , First Publish Date - 2020-04-28T22:43:06+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు పెరగడం స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ముఖ్యంగా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబ సభ్యులను..

కర్నూలు: జిల్లాలో కరోనా కేసులు పెరగడం స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ముఖ్యంగా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబ సభ్యులను అధికారులు నంద్యాల ఎస్సార్ బీసీ దగ్గర ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. అయితే క్వారంటైన్‌లో ఉన్న వాళ్ల వ్యర్థ జలాలు డ్రైనేజీ గుండా పంట పొలాల్లో కలుస్తూ ఉండటంపై స్థానికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రైనేజీ కుందూ నదిలో కలుస్తోందని, దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందుతోందని భయపడుతున్నారు.