ముత్యాలమ్మ జాతర ప్రారంభం
ABN , First Publish Date - 2021-04-07T04:40:40+05:30 IST
మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో మంగళవారం ముత్యాలమ్మ జాతర ప్రారంభమైంది. ఉగాదికి ముందు వచ్చే మంగళవారం నుంచి శుక్రవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

కొవిడ్‌తో పరిమిత సంఖ్యలోనే భక్తులు
చిల్లకూరు, ఏప్రిల్ 6: మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో మంగళవారం ముత్యాలమ్మ జాతర ప్రారంభమైంది. ఉగాదికి ముందు వచ్చే మంగళవారం నుంచి శుక్రవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. గతేడాది కరోనా ప్రభావంతో భక్తులు లేకుండానే జాతరను నిర్వహించారు. ఈ ఏడాది కరోనా రెండో దశ వ్యాపిస్తుండడంతో పరిమితి సంఖ్యలో భక్తులను అనుమతించారు. దాంతో తొలిరోజు భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు. కోట మండలం సిద్దవరం గ్రామంలో పుట్టినిల్లు కుమ్మరింట నుంచి తూర్పుకనుపూరులోని మెట్టినిల్లు చాకలి ఇల్లు గంగమిట్టపై తాటాకుల గుడిసెలు ఏర్పాటు చేసి మంగళవారం అర్ధరాత్రి పోలేరమ్మను ప్రతిష్ఠించారు. గణాచారి పుట్టింటి నుంచి పోలేరమ్మను పంబలోళ్ల వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించడంతో జాతర ప్రారంభమైంది. జాతర ఏర్పాట్లను ట్రస్టు బోర్డు ఛైర్మన్ వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి, ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి, కమిటీ సభ్యుడు సాయికృష్ణారెడ్డి పర్యవేక్షించారు. గూడూరు డీఎప్పీ రాజగోపాల్ రెడ్డి, రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ బాబీ జాతర వద్ద ఎలాంటి ఘర్షణలు, తోపులాటలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.