అన్నను చంపిన తమ్ముడు

ABN , First Publish Date - 2021-04-08T04:51:00+05:30 IST

సొంత అన్ననే తమ్ముడు హత్య చేశాడు.

అన్నను చంపిన తమ్ముడు
హన్మంతు (ఫైల్‌)

నారాయణపేట క్రైం/దామరగిద్ద, ఏప్రిల్‌ 7 : సొంత అన్ననే తమ్ముడు హత్య చేశాడు. ఎస్‌ఐ గోవర్ధన్‌ కథనం మేరకు.. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి గ్రామానికి చెం దిన ఆశప్ప పెద్దకుమారుడు బ్యాగరి హన్మంతు (55)కు తన తమ్ముడు బుగ్గప్పకు కొంత కాలంగా వ్యవసాయ భూ భాగపరిష్కారంలో తగాదాలు ఉ న్నాయి. ఇదే క్రమంలో 5 ఎకరాల భూమిలో భాగ పరిష్కారం చేయాలని పలుమార్లు పెద్దల సమ క్షంలో చర్చలు జరిగినా ఫలితం లేకుండాపోయిం ది. ఈ విషయంలో అన్నపై తమ్ముడు కక్ష పెం చుకున్నాడు. ఇదే క్రమంలో హన్మంతు తన వరి పొలానికి నీరు పెట్టేందు కు మంగళవారం రాత్రి వెళ్లాడు. విషయం తెలుసుకున్న బుగ్గప్ప పొలం వ ద్దకు వెళ్లి అన్నతో గొడవ పడ్డాడు. విషయాన్ని గమనించిన పక్క పొలం వ్యక్తి బ్యాగరి బాలప్ప వారిద్దరినీ సముదాయించేందుకు ప్రయత్నించినా, అ న్నదమ్ములిద్దరి మధ్య ఘర్షణ పెద్దదైంది. బుగ్గప్ప తన వద్ద ఉన్న కత్తితో హన్మంతు చాతిభాగంలో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హ త్యను గమనించిన బాలప్ప విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు తెలి యజేశాడు. సమాచారం అందుకున్న దామరగిద్ద పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని బుధవారం జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమారుడు స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-04-08T04:51:00+05:30 IST